రాజకీయాలలో వారసులు జోరు రోజు రోజుకి పెరుగుతోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ లోని కాంగ్రెస్ నాయకుల గొంతులో పచ్చి వెల్లకాయ పడినట్లు అయింది. అటు మింగలేక కక్క లేకుండా ఉన్నారు. తెలంగాణలో ముందుస్తు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఒక కుటుంబానికి ఒక టిక్కెట్టే కేటాయిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటనతో తెలంగాణ లోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఖంగు తిన్నారు. తమ వారసులకు టిక్కెట్లు ఆశిస్తున్న సీనియర్ నాయకులు అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులందరూ ఢిల్లీ బాట పట్టారు. మాజీ మంత్రి - సీనియర్ నాయకుడు అయిన జానా రెడ్డి తన కుమారుడు రఘు వీర్ ను తన రాజకీయ వారసుడిగా ప్రజలకు పరిచయం చేద్దామనుకున్నారు. తాను నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి - తన కుమారుడైన రఘవీర్ ను మిర్యాలగూడ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్దిగా బరిలోకి దింపుదామని అనుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నిర్ణయంతో ఆయన రాహుల్ గాంధీని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అలాగే మాజీ మంత్రి పటోల సబితా ఇందిరా రెడ్డి కూడా తన కుమారుడు కార్తిక్ రెడ్డిని రాజేంద్ర నగర్ నుంచి పోటికి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో సబిత మహేశ్వరం నియోజకవర్గం నుంచి టిక్కెట్లు ఆశిస్తున్నారు. అయితే కార్తిక్ రెడ్డి తమ అనుచరులతో రాజేంద్ర నగర్ నియోకవర్గంలో ప్రచారం మొదలు పెట్టేసారని ఆయన అనుచరులు అంటున్నారు. కార్తిక్ రెడ్డి గతంలో ఉస్మాన్ సాగర్ కు 15 కిలోమీటర్ల వరకూ ఎటువంటి బహుళ అంతస్థుల భవనాలు కట్టరాదంటూ చేసిన ఉద్యమంతో కొంత వరకూ సానూకూలత వచ్చింది. ఈ ఉద్యమానికి మంచి స్పందన రావడంతో అక్కడి ప్రజలలో ఆయనకు మంచి పలుకుబడి ఉండడంతో కార్తీక్ రెడ్డి తప్పక గెలుస్తారని ఆయన అనుయాయులు అంటున్నారు. అలాగే ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ముకేష్ గౌడ్ - తన కుమారుడైన విక్రమ్ గౌడ్ కు టిక్కెట్టును ఆశిస్తున్నారు. డికె. అరుణ తమ కుమార్తెకు - రామ్ రెడ్డి దామోదర రెడ్డి తన కుమారుడైన సర్వోత్తమ రెడ్డికి ఇలా చాలా మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ వారసులకు టిక్కెట్లు ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నాయకుల విన్నపం విని తన నియామాలను సడలించుకుంటుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి.