టీఆర్ ఎస్ బ‌ల‌హీన‌త‌ల‌ను టార్గెట్ చేసిన కాంగ్రెస్‌

Update: 2018-09-23 15:49 GMT
ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి సిట్టింగ్ ఎమ్మెల్యేను టార్గెట్ చేసేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది . రాబోయే ఎన్నికలలో తెలంగాణలో జరిగే ఎన్నికలకు సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ అవినీతి - వారి వైఫల్యాలే తమ ప్రచారాస్త్రంగా ప్రయోగనించనుంది  కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ జిల్లాలోని ప్రజలలో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వేల ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ - ఈ అంశంతో తెరాసాను ఇరుకున్న పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది. జిల్లాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ పట్ల ఉన్న వ్యతిరేకతను, తమకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటోంది. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కే - తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి టిక్కెట్లు కేటాయించడంతో - ఆప‌ద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును - తెరాస పార్టీని ఇరుకున పెట్టేందుకు మరో అంశం  కాంగ్రెస్ ఖాతాలో  చేరినట్లు అయింది.

ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఆచి తూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం.  తమ ప్రణాళికలో భాగంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో తొలిసారిగా నియోజక వర్గాల వారిగా మేనిఫేస్టోను ప్రకటించాలనుకుంటోంది.  తెలంగాణలో కేసీఆర్ పై ప్రజలలో అభిమానం ఉన్నప్పటికి - తెలంగాణ జిల్లాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత మాత్రం తీవ్ర  స్థాయిలో ఉంది. ఈ వ్యతిరేకతనే తమ ఆయుధంగా మార్చుకుని ప్రజలలోకి వెడదామని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి ఒక చార్జిషీట్ తయారుచేయనుంది. ఈ చార్జిషీట్ లో ఎమ్మెల్యేల అవినీతి - వైఫల్యాలు - ఇతర అంశాలను జోడించి ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయనుంది. ఈ చార్జిషీట్ చాలా పకడ్బందీగా ఉంటుందని, ప్రజలు ఓటు వేసే చివరి క్షణంలో కూడా టీఆర్‌ ఎస్ వైఫల్యాలే గుర్తకు వచ్చేలా ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాను కూడా విస్తృ తంగా వాడుకోవాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా వాట్సాప్ - ట్విట్టర్ ఇతర ప్రచార సాధనాల ద్వారా టీఆర్‌ ఎస్ పార్టీని ఎండగట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటోంది.

చార్జిషీట్‌ లోని అంశాలు "ప్రజా కోర్టులో పీపుల్స్ చార్జిషీటు" పేరున ఈ చార్టీషీటును రూపొందించనున్నారు. ఇందులో ముందుగా 2014లో తెరాస ఇచ్చిన హామీలను పొందు పరుస్తారు.  తర్వాత వాటిలో తెరాస నాయకత్వం ఎంత వరకూ ఇచ్చిన హామీలను నెరవేర్చింది అన్న దాని మీద చార్జిషీటును రూపొందిస్తారు. గత నాలుగేళ్లలో రైతుల ఆత్మహత్యలు - మూత పడ్డ ప్రభుత్వ పాఠశాలలు - రెండు పడకల ఇళ్లు ఇలా ఆ నియోజక వర్గాలాలో నేరవేరని హామీలను పొందుపరచనున్నారు. అంతేకాకుండా లోకల్ ఎమ్మేల్యేల అండతో రెచ్చిపోతున్న రియల్ దందా - ఇసుక కాంట్రక్టులు - మద్యం వంటి అంశాలను, గత నాలుగేళ్లలో పెరిగిన ఎమ్మేల్యేల ఆస్తులను కూడా ఇందులో  పొందు పరచి ఆయా నియోజక వర్గాల ప్రజలను ఆలోచింప చేసేలా ప్రణాళికను రూపొందించనున్నారు.
Tags:    

Similar News