బాగుపడేటోడ్ని చెడగొట్టేవాడు ఉండదు.. చెడిపోయేటోడ్ని బాగు చేసేవాడు ఉండడన్నట్లుగా ఒక సామెతను చెబుతుంటారు. అన్ని విషయాల్లో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. తన తొలి జాబితాను విడుదల చేసే తేదీ విషయంలో ఎంచుకున్న డేట్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
తూర్పు పడమర లాంటి పార్టీల మధ్య పొత్తు పొడిచే ఆసక్తికర పరిణామానికి తెర తీసిన కాంగ్రెస్.. తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్న మాట వినిపిస్తోంది. ఢిల్లీ నుంచి అందే ఆదేశాల ప్రకారం రిమోట్ మాదిరి వ్యవహరించే తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు సీట్లు ఎన్ని తీసుకున్నామన్న లెక్క కాదు.. గెలుపు మాత్రమే ముఖ్యమంటూ మాట్లాడుతున్న తీరుపై ప్రశంసలు వెల్తువెత్తుతున్నాయి. ఇదే తీరును టికెట్ల పంపిణీ వేళలోనూ అమలు చేస్తే.. గెలుపు ఖాయమన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ విడుదల చేసే తొలి జాబితాను ఈ నెల 16న విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే అంతకంటే పిచ్చి పని మరొకటి ఉండదంటున్నారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాదిరి జాతకాలు.. ముహుర్తాల పిచ్చ అంత లేకున్నా.. నామమాత్రంగా కూడా పట్టించుకోవటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా ఈ నెల 16న జాబితాను విడుదల చేయటం అంటే.. ఓటమిని చేజేతులారా ఆహ్వానించినట్లేనని చెబుతున్నారు.
మంచి పనిని ఎవరూ అష్టమి వేళలో చేయరని.. అలాంటిది చావుబతుకుల సమస్యగా అభివర్ణించే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన తొలి అభ్యర్థుల జాబితాను అష్టమి వేళలో విడుదల చేయటం సరికాదంటున్నారు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ మాటల్లో అయితే.. దాచి దాచి దెయ్యాలకు అప్పగిస్తారా? అన్న చందంగా ఇన్ని రోజులు జాబితాను రిలీజ్ చేయకుండా ఆపేసి.. ఇప్పుడు అష్టమి ఘడియల్లో విడుదల చేయటంలో అర్థం లేదంటున్నారు. ఒకవేళ.. ముహుర్తాల్ని పట్టించుకోకుండా జాబితాను విడుదల చేస్తే.. అందుకు తగ్గ ఫలితం అనుభవించక తప్పదన్న మాట బలంగా వినిపిస్తోంది. మరి.. అందరూ హెచ్చరిస్తున్నట్లుగా అష్టమి నాడు విడుదల చేయాల్సిన జాబితాను రిలీజ్ చేస్తారా? పలువురు హెచ్చరికల్ని దృష్టిలో పెట్టుకొని వాయిదా వేస్తారా? అన్నది వెయిట్ చేస్తే కానీ తేలదని చెప్పాలి.