వచ్చేఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలన్న గట్టి పట్టుదలతో కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలోకి రావాలంటే ముందు సీనియర్లంతా ఏకతాటిపైకి రావాలి. ఇపుడు రాష్ట్ర ఇన్చార్జి మాణిక్రావ్ థాక్రే, అధిష్టానంలోని కీలకనేతలు, కర్నాటక ఉపముఖ్యమంత్రి, పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ఇపుడు అదే పనిలో ఉన్నారు. సీనియర్ల మధ్య ఉన్న విభేదాలను సర్దుబాటులో చేయటంలో బిజీగా ఉన్నారు. చాలామంది సినియర్లు విభేదాలను సర్దుబాటు చేసుకునే పనిలో ఉంటే పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోరకమైన బిజీలో కూడా ఉన్నారట.
అదేమిటంటే ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లోకి సీనియర్లు, గట్టినేతలను లాగేయటం. అవకాశముంటే ఎంఎల్ఏ టికెట్ ఇస్తామని లేకపోతే అధికారంలోకి రాగానే కీలకమైన పోస్టు ఇస్తామని హామీ ఇస్తున్నారట. బీఆర్ఎస్, బీజేపీలోని అసంతృప్తులకు గాలమేయటం, గుర్తించటం కాంగ్రెస్ లోకి లాక్కోవటమే టార్గెట్ గా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఈ మొత్తానికి బెంగుళూరు వేదికగా మంతనాలు జరుగుతన్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి.
బీఆర్ఎస్, బీజేపీల్లోని అసంతృప్తులతో మాట్లాడటానికి బెంగుళూరే సరైన వేదికగా కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ చేసినట్లు సమాచారం. బెంగుళూరులో డీకే ఆధ్వర్యంలోనే చర్చలు జరుగుతున్నాయట. బెంగుళూరే ఎందుకంటే హైదరాబాద్ లో అయితే వెంటనే విషయం లీకైపోతుందని కాంగ్రెస్ అధిష్టానం ముందుజాగ్రత్తలు తీసుకున్నదట. పై రెండుపార్టీల్లోని అసంతృప్తుల్లో ఎక్కువమంది ఏదో వ్యాపారంలో బిజీగా ఉంటున్నవారే. కాబట్టి వ్యాపారాలపై బెంగుళూరు, చెన్నైలకు వెళ్ళటం మామూలే. కాబట్టి ఏదో వ్యాపారంమీద బెంగుళూరు వెళ్ళినట్లుగా వెళ్ళి అక్కడే మంతనాలు చేస్తున్నారట.
నలుగురు బీఆర్ఎస్ ఎంఎల్ఏలతో బేరాలాడుతు బేజేపీ నేతలు ఎలా తగులుకున్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అందుకనే అలాంటి సీన్ రిపీట్ కాకుండానే అసంతృప్తులతో భేటీకి బెంగుళూరును వేదికగా చేసుకున్నారట. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి భేటీ అవటానికి ఎలాంటి భయం అవసరంలేదు కదా. ఏదేమైనా కాంగ్రెస్ అధిష్టానం ముందుచూపుతు మంచి వేదికనే ఎంచుకున్నది. తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్న పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కూచుకుళ్ళ దామోధరరెడ్డి లాంటి వాళ్ళంతా బెంగుళూరులోనే చర్చలు జరిపినట్లు పార్టీవర్గాలు చెప్పాయి.