అనుచిత వ్యాఖ్యలు చేసి.. అడ్డంగా బుక్కై.. భైరి నరేష్ ఎట్టకేలకు దొరికాడు..
బైరి నరేష్.. రెండు మూడు రోజులుగా తెలంగాణలో ఇతడు ఎక్కడ దొరుకుతాడోనని అయ్యప్ప భక్తులు సహా హిందుత్వవాదులంతా గాలింపు చర్యలు చేపట్టారు. సంక్రాంతి ముందర పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప మాల ధరిస్తారు. వారి మనోభావాలు దెబ్బతినేలా ఈ అంబేద్కర్ వాది అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. అతడి ఇంటి ఎదుట ధర్నా చేశారు. భైరి నరేష్ అనుచరుడు శంకర్ పై దాడి కూడా చేశారు. దొరికితే చితకబాదాలని ఎదురుచూశారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా తన వ్యాఖ్యలతో అయ్యప్ప భక్తులంతా ఏకమై దాడులకు పురిగొల్పడంతో భైరి నరేష్ దెబ్బకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
అయ్యప్ప భక్తులపై భైరి నరేష్ దారుణ వ్యాఖ్యలు చేశారు. అయ్యప్ప స్వామిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి సభ్యసమాజంలో ఆగ్రహానికి గురయ్యేలా ఉన్నాయి. హిందువులంతా పవిత్రంగా భావించే దేవుడిపై ఈ వ్యాఖ్యలు చేయడంతో ఎవరూ జీర్ణించుకోలేకపోయారు.
నరేష్ వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ధర్నాలకు దిగారు. బైరి నరేష్ పై పలు చోట్ల కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నరేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఎట్టకేలకు నరేష్ వరంగల్ లో పట్టుబడ్డాడు. వరంగల్ లో అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఇక భైరినరేష్ పట్టుబడ్డాడని తెలియగానే అయ్యప్ప స్వాములంతా వరంగల్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. ఉతికిఆరేస్తామని.. ఒక్కసారి బయటకు తీసుకురావాలంటూ నినాదాలు చేశారు. భక్తుల ఆందోళనతో అట్టుడికిన పరిస్థితి నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.