పోలింగ్ ఇక ప్రత్యక్ష ప్రసారం

Update: 2018-11-20 14:30 GMT
తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రతి ఓటరును, ఓటు వేసే సరళిని, పోలింగ్ కేంద్రం లోపల, బయట ఏం జరుగుతుందో ప్రతి అంశం తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం ప్రణాళిక రూపొందిస్తోంది. అన్ని కేంద్రాలను అనుసంధానం చేసి ప్రత్యక్షంగా వీక్షించేలా ‘వెబ్ కాస్టింగ్’ విధానాన్ని తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రవేశ పెట్టనున్నారు.

2009 ఎన్నికల్లోనే సీసీ కెమేరాలను  సమస్యాత్మక ప్రాంతాల్లోనే పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కువగా వినియోగించారు. ఈ సారి అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు ఇంజనీరింగ్ స్టూడెంట్ల సాయం తీసుకోనున్నారు. ఒక్కొక్క కేంద్ర వద్ద ముగ్గురు చొప్పున ఎంపిక చేశారు. అలా మొత్తం 98, 382 మంది విద్యార్థులు అవసరమని గుర్తించారు.

ఈ మధ్య ఈవీఎంలపై వస్తున్న వదంతులను కొట్టిపారేస్తున్న ఎన్నికల కమిషన్, పారదర్శకంగా, నమ్మకమైనదిగా భావించేలా ఏర్పాట్లుచేసింది. ఓటరు ఓటును నమోదు చేసుకున్న తరువాత ఐదు నుంచి ఏడు సెకన్లపాటు ఎవరికి ఓటు వేశామో తెలిసేలా సంబంధిత పార్టీ గుర్తు స్క్రీన్ పై తెలిసిలా ఏర్పాటు చేసింది. అంతేగాక, ఈవీఎంలపై ఫిర్కాదులను ఓటర్‌ వెరిఫయబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీ పాట్‌) ద్వారా నమోదు చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఓటర్లు ఓటు వేసే విధానం.. ఎన్నికల అధికారులు, భద్రత సిబ్బంది.. ఏజెంట్ల కదలికలు సహా అంతా లైవ్ లో ఎన్నికల సంఘం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా లైవ్ వెబ్ కాస్టింగ్ వెబ్ సైట్ ను కూడా మొదలు పెట్టారు..
http://webcast.gov.in/eci/
ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేలా ఢిల్లీ నుంచి గల్లీ దాకా అధికారులు చూసేలా ఏర్పాట్లు చేశారు. లైవ్ ప్రసారం చేయలేదని కేంద్రాల్లో సీసీ టీవీలను పెట్టి అనుసంధానం చేయనున్నారు. ఈ ఎన్నికల లైవ్ వెబ్ కాస్టింగ్ లో ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో సేవల కోసం ఈసీ ఇప్పటికే 98382మంది విద్యార్థులను అవసరమని గుర్తించి  వారిని ఎంపిక చేస్తున్నారు..


Tags:    

Similar News