కొత్త సంవత్సరం ముందు రోజున మందుబాబులకు పెద్ద తీపికబురును ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ. మద్యం దుకాణాల్లో.. బార్లల్లో మద్యం అమ్మకాలపై రోజూ ఉండే పరిమితుల్ని సడలించింది. హ్యాపీ న్యూ ఇయర్ ను మందు కొట్టి.. మత్తు మత్తుగా స్వాగతం పలకటానికి.. మత్తుతో తూలిపోతూ ఎంజాయ్ చేయటానికి అవసరమైన అన్నీ ఏర్పాట్లను తెలంగాణ ఎక్సైజ్ శాఖ చేసేసిందని చెప్పక తప్పదు.
కొత్త సంవత్సరం అడుగుపెట్టే వేళ.. మద్యం అమ్మకాలు భారీగా జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. అమ్మకాల్ని పెద్ద ఎత్తున జరిగేలా చూసేందుకు అవసరమైన కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. ఈ రోజు అంటే డిసెంబరు 31.. శనివారం అర్థరాత్రి 12 గంటల వరకూ రాష్ట్రంలోని ఏ మద్యం దుకాణమైనా అమ్మకాలు జరుపుకోవచ్చు.
అంతేకాదు.. బార్లు.. క్లబ్ లు.. టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ హోటళ్లు.. ఈవెంట్లలో ఈ రోజు అర్థరాత్రి ఒంటి గంట వరకు మద్యం అమ్మకాలు జరిపేవీలుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మందుబాబులకు ఫుల్ మందేనని చెప్పక తప్పదు. అర్థరాత్రి ఒంటి గంట వరకూ బార్లలో.. హోటళ్లలో.. ఈవెంట్లలో మద్యం అమ్మకాలకు ఓకే చెప్పిన వేళ.. మద్యం అమ్మకాలు భారీగా సాగటం ఖాయం. అందుకు తగ్గట్లే.. షాపుల వారు.. ఈవెంట్ల వారు భారీ ఎత్తున మద్యాన్ని లిఫ్ట్ చేస్తుండటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/