బాయిల్డ్ రైస్ పంపడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం: పీయూష్ గోయల్

Update: 2021-12-08 11:33 GMT
పార్లమెంట్ శీతకాల సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమ్యలు ఎంపీలు లేవనెత్తగా అందుకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఇటీవల తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏర్పడిన వివాదంపై పార్లమెంట్ లో జోరుగా చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని నిన్నటి వరకు ఆందోళన చేసిన టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

అయితే తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం తప్ప సమస్యను పరిష్కరించే దారి చూపడం లేదు. ఇందులో భాగంగా బుధవారం మరోసారి ధాన్యం కొనుగోలుపై చర్చ సాగింది.

కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ డ్రామా చూపించి ఆ తరువాత ఏం మాట్లాడలేకుండా సమావేశాలు బహిష్కరించారని అన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి లేవనెత్తిన అంశాలపై కేంద్ర ఆహార మంత్రి పీయూస్ గోయల్ స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ ఉత్తమ్ కుమార్ లేవనెత్తిన అంశానికి, ప్రస్తుతం నడుస్తున్న చర్చకు సంబంధం లేదు వరిధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత రాష్ట్రానిదే.

కేంద్రానికి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంటుంది. తెలంగాణ ప్రభుత్వం బాయిల్డ్ రైస్ సరఫరా చేయడంలో విఫలమైంది.ఈ విషయంపై ఇప్పటికే విధి విధానాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పాం.’ అని అన్నారు.

మరోవైపు ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే రైతులకు కనీస మద్దతు ధరపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎంఎస్ పీని చట్టబద్ధం చేసేందుకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం సంబంధిత పార్టీలతో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కోరరారు. రైతు ప్రయోజనాలపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలన్నారు.

తమ ప్రభుతం రైతులకు కనీస మద్దతు ఆచరించిచూపించిందన్నారు. కేంద్రం 23 వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పిస్తే.. ఏపీ ప్రభుత్వం అదనంగడా 24 పంటలకు కనీస మద్ధతు ధర చెల్లిస్తుందన్నారు. అంటే మొత్తంగా 47 పంటలకు కనీస మద్దతు ధర కల్పించిందన్నారు.

ఇక రాజ్యసభలోనూ రైతు సమస్యలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర కల్పించాలని, బాధిత రైతు కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. రైతులపై ఉన్న కేసులను కొట్టివేసేందుకు ఆదేశాలు జారీచేయాలన్నారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాట్లాడుతూ రైతులు, సామాన్యలును బీజేపీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. ఓ వైపు నిత్యావసర ధరలు పెరగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. ఏడాది కాలంగా ఎండనకా.. వనాననకా రైతులు ఉద్యమాలు చేస్తున్నారని, కుటుంబాలను విడిచిపెట్టి ఢిల్లీ రోడ్లపై ఆందోళన చేపట్టారన్నారు.

అలాగే రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సస్పెండ్ అయిన ఎంపీలకు సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు.

అదే విధంగా నాగాలాండ్లో జరిగిన ఘటనపై పార్లమెంట్ లో చర్చ జరిగింది. పీపుల్స్ ఎంపీ కేజీ కెన్యె రాజ్య సభలో నోటీసులు జారీ చేశారు. వివాదాస్పద సైనిక చట్టాన్ని రద్దు చేయాలని కోరారు.

చైనా, భూటాన్ సరిహద్దు సమస్యలపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్ సభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అంతకుముందు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో ప్రత్యేక హాల్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాజ్ నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.

Tags:    

Similar News