సంక్షేమ ప‌థ‌కాలు ప‌నిచేయ‌వా.. మునుగోడులో ప‌నిచేయ‌లేదా?

Update: 2022-11-07 16:30 GMT
ఏ ప్ర‌భుత్వ‌మైనా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోందంటే.. దానిపై ఆ ప్ర‌భుత్వానికి గంపెడు ఆశ‌లు ఉంటాయి. ఏ ప‌థ‌కాన్ని కూడా ప్ర‌భుత్వాలు ఊరికేనే ప్ర‌వేశ పెట్ట‌వు. ఆయా ప‌థ‌కాల ద్వారా త‌మ‌కు అనుకూల ఓటు బ్యాంకు పెరుగుతుంద‌ని ఆశిస్తాయి.

అయితే.. తాజాగా జ‌రిగిన తెలంగాణ‌లోని మునుగోడు ఉప ఎన్నిక‌లో ఈ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేద‌నే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.,. ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలే క‌నుక ఎన్నిక‌ల్లో ప‌నిచేసి ఉంటే ఖ‌చ్చితంగా ఇక్క‌డ `వార్ వ‌న్ సైడే` అన్న‌ట్టుగా ప‌రిస్తితి ఉండి ఉండాలి. అంతేకాదు.. ఓటును డ‌బ్బులు ఇచ్చి కొనుగోలు చేసుకునే ప‌రిస్థితి కూడా ఉండి కూడ‌దు.

కానీ, అలా ఏమాత్రం జ‌ర‌గ‌లేదు. అధికార పార్టీ టీఆర్ ఎస్ ఇక్క‌డ చేసిన `య‌జ్ఞం` అంతా ఇంతా కాదు. నిజానికి కేసీఆర్ స‌ర్కారు అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోంది. ద‌ళిత బంధు, క‌ళ్యాణ ల‌క్ష్మి, రైతు భ‌రోసా, గొర్రెల పంపిణీ, పింఛ‌న్లు.. ఇలా అనేక ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. అవ‌న్నీ కూడా.. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలోని 2 ల‌క్ష‌ల మంది ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయి. నెల‌నెలా పించన్లు వ‌స్తున్నాయి. అదేవిధంగా గొర్రెల పంపిణీ కూడా.. ఇక్క‌డ సాగింది. ద‌ళిత బంధును కూడా కొంద‌రికి అందించారు. అంటే.. మొత్తంగా ఇక్క‌డ ల‌బ్ధి పొందారు.

ఇదిలావుంటే, కీల‌కమైన అంశం.. ఫ్లోరైడ్ బాధిత ప్రాంత‌మైన మునుగోడులో ఆ ప‌రిస్తితిని త‌ప్పించేందుకు మిష‌న్ భ‌గీర‌థ కార్య‌క్ర మాన్ని అమ‌లు చేసి.. తాగునీటిని అందించారు. రైతుల‌కు సాగునీటిని కూడా ఇచ్చారు. ఇలా.. అనేక రూపాల్లో ఇక్క‌డ టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ సంక్షేమాన్ని ప్ర‌జ‌లు అందుకున్నారు. అంటే.. ఈ సంక్షేమ కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌బుత్వానికి అనుకూలంగా ఇక్క‌డి ప్ర‌జ‌లు వ్య‌వ‌హ‌రించాలి. క‌నీసం.. అభిమానం అయినా చూపించాలి. కానీ, ఇవేవీ ప‌నిచేయ‌డం లేద‌ని.. తాజా ఉప ఎన్నిక స్ప‌ష్టం చేసింది. కేవ‌లం సంక్షేమం ఏమాత్రం ప‌నిచేయ‌డం లేద‌ని రుజువు చేసింది. క‌ళ్ల‌కు సైతం క‌ట్టింది.

ఎలాగంటే.. తాజాగా ఉప పోరులో ఓటుకు రూ.5 వేల చొప్పు పంచితే త‌ప్ప‌.. ఓటు వేసేందుకు ప్ర‌జ‌లు ముందుకు రాలేదు. అంతేకాదు.. త‌మ‌కు డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని.. ప్ర‌జ‌లు ప్ర‌శ్నించ‌డం.. నాయ‌కుల‌తో వివాదాలు పెట్టుకోవ‌డం రోడ్డెక్క‌డం కూడా క‌నిపించింది. ఇక‌, మ‌రోవైపు.. డ‌బ్బులు పంచ‌డ‌మే కాదు.. దాదాపు 90 మంది ఎమ్మెల్యేల‌ను అదికార పార్టీ రంగంలోకి దింపి ప్ర‌చారం చేయించింది. అంతేకాదు.. రాష్ట్ర‌స్తాయి మంత్రుల‌ను... ఏకంగా మండ‌లాల‌కు ప‌రిమితం చేసి.. వారికి మండ‌లాల్లో గెలిపించే బాధ్య‌త‌ను అప్ప‌గించింది.

ఇక‌, సీఎం కేసీఆరే.. స్వ‌యంగా రంగంలోకి దిగి.. రెండు సార్లు బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించారు. పోనీ.. ఇంత చేసినా.. ఆశించిన మెజారిటీ ఏమైనా వ‌చ్చిందా? అంటే.. లేదు. చ‌చ్చీచెడీ.. తీవ్ర ఉత్కంఠ పోరులో.. కేవ‌లం 10 వేల పైచిలుకు ఓట్ల అత్యంత సాధార‌ణ మెజారిటీని కైవ‌సం చేసుకుని.. చావు త‌ప్పింది.. అన్న‌ట్టుగా బ‌య‌ట ప‌డ్డారు. సో.. ఇందుమూలముగా తెలియ‌జేసేది ఏంటంటే.. వేల కోట్లు అప్పులు చేసి.. సంక్షేమాన్ని అమ‌లు చేసినా.. ఓట్లు కావాలం



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News