ఎవరి ఆస్తి ఎంత అన్నది వెల్లడించటం తప్పేం ఉంది? అన్న మాట ఎంతమాత్రం సరికాదన్న భావన కలుగుతుందీ వ్యవహారం చూస్తే. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వారు.. తమ ఆస్తుల్ని అధికారికంగా ప్రకటిస్తే జరిగే నష్టం ఏమిటన్నది తెలీకున్నా.. తెలంగాణ సర్కారు ఈ అంశంపై వెనక్కి తగ్గిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులు తమ ఆస్తుల వివరాల్ని జనవరి 10లోపు వెల్లడించాలంటూ విద్యాశాఖ ఆదేశించింది. అయితే.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపైన వివిధ ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయటం గమనార్హం. ఇలాంటి నిర్ణయం కారణంగా ఉపాధ్యాయుల మనోబావాలు దెబ్బ తింటాయని చెప్పటం విశేషం.
సమాజానికి స్ఫూర్తిదాతలుగా ఉండాల్సిన ఉపాధ్యాయులు.. మిగిలిన వర్గాల వారికి స్ఫూర్తిగా నిలుస్తూ.. ఎవరికి వారు తమ ఆస్తిపాస్తుల్ని ప్రభుత్వానికి వెల్లడిస్తే వచ్చే నష్టం ఏమిటన్నది పెద్ద ప్రశ్న. ఉద్యోగులు.. తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న స్థిర.. చర ఆస్తుల్ని వెల్లడించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి ‘మనోభావాలు’’ అన్నది తీసుకురావటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్తుల వెల్లడికి మనోభావాల్ని అడ్డంకిగా చూపించిన ఉపాధ్యాయుల వాదనకు తెలంగాణ సర్కారు సరేనని చెప్పటం చూస్తే.. మనోభావం అన్న మాట తెలంగాణ సర్కారు మీద ఎంత ప్రభావం చూపిస్తుందో ఇట్టే అర్థమవుతుంది. ఆస్తుల వెల్లడికి.. మనోభావాలకు సంబంధం ఏమిటన్న ప్రశ్న తెలంగాణ సర్కారు ఎందుకు వేయదన్నది ప్రశ్న.నిజానికి ప్రభుత్వ ఉద్యోగులు అందరూ తాము ఉద్యోగాల్లో చేరే వేళ ఆస్తుల్ని ప్రకటించి.. ప్రతి ఐదేళ్లకో.. పదేళ్లకో ఒకసారి విధిగా తమ ఆస్తిపాస్తుల్నివెల్లడిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి వేళ.. మనోభావాల పేరిట ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటున్న తీరుపై ప్రభుత్వం మరోసారి దృష్టి పెడితే మంచిదేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/