ఖర్చులు పెరుగుతున్న వేళ ఆదాయాన్ని పెంచుకోవటానికి వ్యక్తిగతంగా మనం ఎలా ఆలోచిస్తామో.. ప్రభుత్వాలు అదే తీరులో ఆలోచిస్తాయి. కాకుంటే.. సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లాల మాదిరి వేలాది కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం.. అందుకు సరిపడా ఆదాయం కోసం ప్రజల్నే లక్ష్యంగా చేసుకోవటం గమనార్హం. తాజాగా అలాంటి టార్గెట్ పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ద్వారా ఏడాదికి ఆరువేల కోట్ల రూపాయిలు వస్తున్న వేళ.. దాన్ని రూ.12వేల కోట్లకు పైగా పెంచుకునే దిశగా ప్లానింగ్ చేస్తున్నారు. ఇందుకు ఏం చేస్తే బాగుంటుందన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.
తాజాగా తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో చివరకు తేలిందేమంటే.. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను పెంచటంతో పాటు.. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్ధం కానున్నట్లు చెబుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నిర్ణయించిన భూముల మార్కెట్ విలువ.. రిజిస్ట్రేషన్ ఛార్జీలే ఇప్పటికి అమల్లో ఉన్నాయి.
బహిరంగ మార్కెట్లో భూముల విలువ భారీగా పెరిగిన వేళ.. ఆ అంశాల్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రభుత్వం కూడా భూముల విలువను పెంచితే.. రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా పెరుగుతుందని భావిస్తోంది. ఇదే జరిగితే.. రిజిస్ట్రేషన్ విలువ ఇప్పటికంటే ఎక్కువగా చేయాల్సి వస్తుంది. దీంతో ప్రభుత్వానికి అదనపు ఆదాయం లభిస్తుంది. దీంతో పాటు.. ప్రస్తుతం ఆరు శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఫీజును ఏడు శాతంగా పెంచాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణచుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలైన ఏపీ.. తమిళనాడు.. మహారాష్ట్రల్లో 7 - 7.5 శాతం మధ్యలో ఉండటంతో.. తాము పెంచే మొత్తానికి ప్రభుత్వ వ్యతిరేకతరాదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. త్వరలోనే భూముల విలువ పెంచటంతో పాటు.. రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పెంచటం ద్వారా ప్రభుత్వానికి వేలాది కోట్లు సమకూరే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రజల మీదా అంతే మోతాదులో భారం పెరుగుతుందని చెప్పక తప్పదు.