బార్లా తెరిచేశారు:తెలంగాణ అంత‌టా బార్లేనా..?

Update: 2015-08-26 11:26 GMT
ఎవ‌రూ ఊహించ‌ని నిర్ణ‌యాలు తీసుకోవ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు కొత్తేం కాదు. వైరుధ్యంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. కొన్ని విష‌యాల్లో అవ‌స‌రానికి మించిన క‌ఠిన‌త్వంగా ఉండే ఆయ‌న‌.. మ‌రికొన్ని విష‌యాల్లో అందుకు భిన్నంగా చాలా ఉదారంగా ఉంటారు. తాజాగా కేసీఆర్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం చూస్తే.. ఈ విష‌యం మ‌రోసారి అర్థ‌మ‌వుతుంది.

తెలంగాణ వ్యాప్తంగా కొత్త బార్ల‌కు లైసెన్స్ లు ఇవ్వ‌టానికి స‌ర్కారు సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకోసం బుధ‌వారం లైసెన్స్‌ లు జారీకి విధివిధానాలు ఖారు చేస్తూ జీవో జారీ చేసింది.  తాజా విధివిధానాలు చూస్తే.. తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేష‌న్లు.. మున్సిపాలిటీలు.. మేజ‌ర్ మున్సిపాలిటీలు.. న‌గ‌ర పంచాయితీలు అన్న తేడా లేకుండా ప్ర‌తి 30వేల జ‌నాభాకు ఒక బార్ లైసెన్స్ జారీ చేయాల‌ని భావిస్తోంది. అంతేకాదు.. త్రీ స్టార్ హోట‌ళ్ల‌లోనూ మ‌ద్యం అమ్మ‌కాల‌కు స‌ర్కారు ప‌చ్చ‌జెండా ఊపేసింది.

అంతేకాదు.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 13వేల జ‌నాభాకు ఒక బార్ లైసెన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. తాజాగా విడుద‌ల చేసిన ఉత్త‌ర్వులు య‌థాత‌ధంగా అమ‌లు కాని జ‌రిగితే.. తెలంగాణ వ్యాప్తంగా బార్లు పెద్ద ఎత్తున పెరిగే అవ‌కాశం ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News