మునుగోడు తెచ్చిన ఉత్సాహంతో గులాబీ బ్యాచ్ రెచ్చిపోతోంది. బీజేపీని ఇక ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని తొడగొడుతోంది. బీజేపీ నేతలే కాదు.. బీజేపీ ప్రోద్బలంతో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్న గవర్నర్ తమిళిసై తో కూడా తలపడేందుకు రెడీ అయ్యింది.
తెలంగాణ ప్రభుత్వానికి తాజాగా గవర్నర్ తమిళిసై నుంచి లేఖ అందింది. యూనివర్సిటీల కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై రాజ్ భవన్ కు వచ్చి విద్యాశాఖ మంత్రి చర్చించాలని సూచించారు. ప్రభుత్వంతోపాటు యూజీసీకి కూడా గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా రిక్రూట్ మెంట్ చెల్లుబాటు అవుతుందా? అని యూజీసీ అభిప్రాయాన్ని గవర్నర్ కోరారు.
దీనిపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ప్రభుత్వానికి గవర్నర్ నుంచి లేఖ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సబిత.. గవర్నర్ ను కలవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. అపాయింట్ మెంట్ కోరామని.. ఇంకా ఖరారు కాలేదన్నారు. గవర్నర్ ను కలిసి ఆమె సందేహాలను నివృత్తి చేస్తామన్నారు.
గవర్నర్ ఫిర్యాదు ఏంటంటే.. మూడేళ్లుగా తెలంగాణలోని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయాలని చెబుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోలేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన సమస్యలు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందని గవర్నర్ పేర్కొన్నారు.
యూనివర్సిటీ ఖాళీలు భర్తీ చేసేంత ఆర్థిక సామర్థ్యాలు కేసీఆర్ సర్కార్ వద్ద లేవు. అందుకే జాప్యం చేస్తోంది. గవర్నర్ దాన్నే పట్టుబడుతోంది. ఈ పంచాయితీని గవర్నర్ వద్దే తేల్చుకునేందుకు టీఆర్ఎస్ సర్కార్ రెడీ అవుతోంది. మరి ఎవరి మాట నెగ్గుతుందన్నది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.