తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏమిటంటే.. తాను చేసిన పనుల వెనకున్న పరమార్థాన్ని ఓపెన్ గా చెప్పేస్తుంటారు. తాజాగా అలాంటి విషయాన్నే చెప్పి అవాక్కు అయ్యేలా చేశారు. తరచూ సంపన్న రాష్ట్రంగా చెప్పే తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు.. పెన్షన్ దార్లకు ఇవ్వాల్సిన జీతాలు.. పెన్షన్ మొత్తాల్లో కోత పెట్టిన వైనం తెలిసిందే. సారు తీసుకున్న నిర్ణయంపై అందరిలోనూ ఆగ్రహం ఉన్నా.. పల్లెత్తు మాట అనలేని పరిస్థితి. పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ల పరిస్థితి మరింత ఆగమైన పరిస్థితి.
ఇలాంటివేళ.. తన చర్యను సమర్థించుకున్నారు కేసీఆర్. అంతేకాదు.. తాను పెట్టిన కోత వాత వెనకున్న అసలు విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపోయేలా చేశారు. ప్రతి ఏటా రైతుబంధు పథకం కింద రైతులకు నగదు ప్రోత్సాహాకాన్ని ఇవ్వటం తెలిసిందే. తమకు జీతాలు.. పెన్షన్లు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కానీ.. సంక్షేమ పథకం కోసం వందల కోట్లు ఖర్చు పెడతారా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినోళ్లు లేకపోలేదు.
ఈ సందేహానికి సమాధానం ఇచ్చేసిన సీఎం కేసీఆర్.. రానున్న రోజుల్లో జీతాల కోత వాత గురించి తనను పల్లెత్తు మాట అనకుండా ఉండేలా భావోద్వేగ అస్త్రాన్ని సంధించారు. జీతాలు.. పెన్షన్లకు కోత పెట్టి మిగిల్చిన నిధులతోనే తమ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేసినట్లు చెప్పారు. రైతులకు పెద్ద పీట వేసే క్రమంలో అలా చేయాల్సి వచ్చిందన్న కేసీఆర్ పుణ్యమా అని.. రానున్న రోజుల్లో జీతాల్లో కోత పెట్టిన వైనాన్ని క్వశ్చన్ చేసేందుకు వీలు లేకుండా చేశారని చెప్పాలి.
రైతులకు అందించే సంక్షేమ పథకానికి అవసరమైన నిధుల్ని అడ్జెస్ట్ చేసిన వైనాన్ని ఉద్యోగులు.. పెన్షన్ దారులతో పోలిస్తే ఎక్కువమంది ఉండటాన్ని మర్చిపోకూడదు. జీతాలు కాస్త ఆపినా వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే.. ఎన్నికలకు కాస్త ముందుగా పీఆర్సీ ని కాస్త పెంచితే.. ఇప్పుడు పెట్టిన తాత్కాలిక కోత వాత నొప్పిని మర్చిపోవటం ఖాయం. అదే సమయంలో.. లక్షల్లో ఉండే రైతులకు సారు ఎంత పెద్ద పీట వేస్తారన్న విషయాన్ని స్వయంగా చూసిన వారంతా కేసీఆర్ కు విదేయులుగా ఉండిపోవటం ఖాయం. ఏతావాతా చెప్పేదేమంటే.. అందరూ వాత పెడతారు. కానీ.. పెట్టిన వాత తాలుకూ నొప్పిని సైతం బయటకు వెళ్లగక్కలేని రీతిలో సీన్ ను సెట్ చేయటం మాత్రం కేసీఆర్ కే సాధ్యమేమో?