తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ప్రతిరోజూ కూడా 1500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధిక కేసులు బయటపడటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా కరోనా మహమ్మారి తెలంగాణ హైకోర్టును తాకింది. ఇప్పటివరకు హైకోర్టులో 25 మంది ఉద్యోగులకు కరోనా సంక్రమించింది. దీంతో రేపటి నుంచి హైకోర్టు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు.
అలాగే, హైకోర్టును పూర్తిగా శానిటైజ్ చేయాలని న్యాయమూర్తులు ఆదేశించారు. హైకోర్టు లోని ఫైల్స్ అన్నింటిని జ్యూడీషీయల్ అకాడమీకి తరలించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమైన కేసులను విచారించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేసే కేసుల విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్ లో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో హైకోర్టు మూసివేత నిర్ణయం సరైనదే. ఎందుకంటే మరింత మంది ఆ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే, దానికి దూరంగా ఉండడం ఒక్కటే పరిష్కార మార్గం.
కాగా, తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27వేల మార్క్‌ను దాటేసింది. మొత్తం కేసుల సంఖ్య 27,612కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 313కి పెరిగింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 11,012 యాక్టివ్ కేసులు ఉన్నాయి.