కరోనావైరస్ దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. మొదట్లో దేశంలో కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ ఈమధ్య కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతవారం రోజులుగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే దేశంలో 13 లక్షలకి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం చాలా దేశాల్లో శాస్రవేత్తలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్వై రస్ కిల్లర్ అనే పరికరాన్ని శుక్రవారం ఆవిష్కరించారు.
ప్రపంచాన్ని సార్స్, ఎబోలా పట్టి పీడిస్తున్న తరుణంలో వాటిని అంతం చేయడానికి దక్షిణ కొరియా ఈ పరికరాన్ని రూపొందించింది. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. ఇది గాలిలో ఉండే కరోనా వైరస్ ను కూడా తనలోకి లాగేసుకుంటుంది అని తెలిపారు. ఈ మిషన్ కి సంబంధించి ఉర్జా క్లీన్ టెక్ సంస్థ దేశవ్యాప్తంగా సేల్స్ అండ్ సర్వీస్ సేవలు అందిస్తోంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదనరావు, వైస్ ప్రెసిడెంట్ విష్ణు భరద్వాజ్‌లు మంత్రికి ఈ పరికరం గురించి వివరించారు. పరికరం ఉన్న పరిసరాల్లో ఉన్నవారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవని తెలిపారు. సెమినార్ హాళ్లు, తరగతి గదులు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్‌లలో ఇవి చాలా ఉపయోగపడతాయని తెలిపారు.