తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు గొప్ప తీపికబురు ఇది. ఇంకా చెప్పాలంటే ఆ విజయాల చరిత్రకు కీలకమైన మలుపు. ఓట్ల స్కెచ్ ను విజయవంతంగా అమలు చేసేందుకు మార్గం సుగమం అయింది. తెలంగాణ జీవధారగా టీఆర్ ఎస్ పార్టీ పేర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తుది అనుమతులు వచ్చాయి. గతంలోనే కేంద్ర జలసంఘం నుంచి ఏడు అనుమతులు సాధించిన ఈ చారిత్రక ప్రాజెక్టుకు ఇప్పుడు మరో రెండు చిట్టచివరి కీలక అనుమతులను సీడబ్ల్యూసీ మంజూరు చేసింది. ఒకవైపు నీటిపారుదల ప్రణాళిక (ఇరిగేషన్ ప్లానింగ్)తో పాటు ప్రాజెక్టు అంచనా వ్యయానికి సంబంధించి ప్రాజెక్టు అధికారులు సమర్పించిన నివేదికలపై రెండు డైరెక్టరేట్లు సంతృప్తి వ్యక్తం చేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు తిరుగులేదు - అనుమతినిస్తున్నామంటూ అధికారిక ఉత్తర్వులు జారీచేశాయి. ఏడాదికాలంలోనే తొమ్మిది అనుమతులు సాధించడమనేది సరికొత్త రికార్డు. అనుమతులకు సహకరించిన కేంద్ర - కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు - మరో 18.82 లక్షలఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘంలోని రెండు కీలక డైరెక్టరేట్లు తాజాగా అనుమతులు ఇచ్చాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్లించే నీటి పరిమాణం - నిర్ణయించిన నీటిడిమాండ్ ను సాంకేతికంగా పరిశీలించిన ఇరిగేషన్ ప్లానింగ్ డైరెక్టరేట్ సంతృప్తిని వ్యక్తంచేసింది. నివేదికలను పరిశీలించి అనుమతి జారీ చేస్తున్నట్టు సంబంధిత డైరెక్టరేట్ డైరెక్టర్ బీసీ విశ్వకర్మ కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ కు అధికారిక పత్రాన్ని అందజేశారు. మేడిగడ్డ నుంచి మళ్లించే 195 టీఎంసీల గోదావరి జలాలతోపాటు ఎల్లంపల్లి రిజర్వాయర్ లోకి వచ్చే 20 టీఎంసీలు - అదనంగా ప్రాజెక్టు పరిధిలో 25 టీఎంసీల మేర భూగర్భజలాలు మొత్తం 240 టీఎంసీలను ప్రాజెక్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. సుమారు 37 లక్షల ఎకరాలకు సాగునీరు (కొత్త ఆయకట్టుతోపాటు స్థిరీకరణతో కలిపి) కింద 169 టీఎంసీలు - హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 30 టీఎంసీలు - దారిలోని గ్రామాల తాగునీటికిగాను 10 టీఎంసీలు - పారిశ్రామిక అవసరాల కింద 16 టీఎంసీలు.. మొత్తం డిమాండ్ 237 టీఎంసీలుగా పేర్కొన్నారు. 240 టీఎంసీల మళ్లింపు.. 237 టీఎంసీల డిమాండ్ ను పరిశీలించి - నివేదికల ప్రకారం 32 ఏండ్లు నీరు అందుబాటులో ఉంటుందని డైరెక్టరేట్ సంతృప్తి వ్యక్తం చేసింది.
దీంతో టీఆర్ ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాజకీయంగా పునాదులు కదిలిపోతుండటంతో ప్రాజెక్టును అడ్డుకునేందుకు కాంగ్రెస్ చేయని ప్రయత్నం లేదని అయితే తమ ప్రయత్నంలో ఉన్న నిజాయితీ వల్ల ఫలితం ఇలా వచ్చిందని తేలింది. రైతులను తప్పుదోవ పట్టించడం మొదలు హైకోర్టు - సుప్రీంకోర్టు.. తెలంగాణకు సంబంధంలేని ఢిల్లీలోని జాతీయహరిత ట్రిబ్యునల్ వరకు అన్నింటినీ ఆశ్రయించిందని మొత్తం 197 కేసులు వేసిందని టీఆర్ ఎస్ నేతలు అంటున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను భగ్నం చేసేందుకు ప్రయత్నించి భంగపడింది. ఈ కుట్రలన్నింటినీ పటాపంచలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు గోడకు కొట్టిన బంతిలా శరవేగంగా పనులు పూర్తిచేసుకుంటూ.. రికార్డు సమయంలో అనుమతులను పొందుతూ ముందుకుపోతోందని హర్షం వ్యక్తం చేశారు.