తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారంలో ఇరుక్కుపోయి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని బయటకు రానీయకుండా చేయడానికి తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఏసీబీ తరపున ఈ కేసులో వాదిస్తున్న వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ రేవంత్‌ను బయటకు వదలడానికి వీలు లేదని స్పష్టం చేస్తున్నారు. రేవంత్ చాలా శక్తిమంతమైన వ్యక్తి అని.. ఆయన బయటకు వస్తే కేసు ప్రభావితం కాగలదన్న అభిప్రాయాన్ని వినిపించారు.
ఈ సందర్భంగా తెలంగాణ లాయర్లు కనిమొళి కేసును ప్రస్తావించడం విశేషం. 2జీ స్కామ్‌ను ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి కి బెయిల్ ఇవ్వవద్దని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ న్యాయవాది. 2జీ స్కామ్ విచారణ చాలా నెలల పాటు జరిగిందని.. అప్పుడంతా ఆ కేసులో నిందితురాలు కనిమొళి జైల్లోనే ఉందని.. రేవంత్ ఓటుకు నోటు కేసు కూడా 2జీకి సరిసమానమైనదేనని.. ఇప్పుడు రేవంత్ బయటకు వస్తే పరిస్థితి మొత్తం మారిపోతుందని ఏసీబీ తరపున న్యాయవాదులు పేర్కొన్నారు.
రేవంత్ కూడా శక్తిమంతమైన వ్యక్తేనని.. ఆయనను బయటకు వదిలితే సాక్షులను ప్రభావితం చేయగలడని న్యాయవాదులు నివేదించారు. మరి వీరి వాదనతో న్యాయమూర్తి ఏకీభవించాడా? లేదా? అనే అంశంపై క్లారిటీ రావాలంటే ఈ కేసులో తీర్పువచ్చే వరకూ వేచి ఉండాలి.