దేశంలో కరోనా మహమ్మారి క్రమక్రమంగా విజృంభిస్తోంది. కరోనాను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నా కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు ...రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను కట్టదిట్టం చేస్తూనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. బయటకి వస్తే మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేస్తున్నాయి.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఇంటి నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని తెలిపింది. కరోనా సోకిన వారిలో చాలా మందిలో వ్యాధి లక్షణాలు బయటకు కనిపించడం లేదని - అలాంటి వారి వల్ల ఇతరులకు కరోనా వైరస్ వ్యాపించే అవకావం ఉండటంతో, ఇంటి నుండి బయటకి వస్తే మాస్క్‌లను వాడటం తప్పనిసరి చేసింది. కాగా , మాస్కులు ధరించడానికి తప్పనిసరి చేస్తూ దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 471కి చేరింది. 12 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జి కావడం తో.. రాష్ట్రంలో ప్రస్తుతం 414 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 101 హాట్ స్పాట్ కేంద్రాలను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం - ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిపివేసింది. లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని - లేకపోతే కరోనా వ్యాధి తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని మంత్రి ఈటల రాజేందర్ ఇప్పటికే తెలిపారు. అలాగే లాక్ డౌన్ కు ప్రజలందరూ బాగా సహకరిస్తున్నారని - అలాగే మరికొన్ని రోజులు ప్రభుత్వానికి మద్దతునిస్తే కరోనా పై మనదే విజయం అని అయన తెలిపారు.