అరగంటపాటు లిఫ్ట్‌ లో ఇరుకున్న మంత్రి

Update: 2020-11-06 13:30 GMT
ఎరక్కపోయి ఇరుక్కోవడం అంటే ఇదేనేమో..  తెలంగాణ మంత్రివర్యులకు ఇప్పుడు ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి ఎదురైంది. అరగంట పాటు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయిన మంత్రి ఏ క్షణం ఏమవుతుందోనని భిక్కుభిక్కుమంటూ గడిపాడు. చివరకు అరగంట తర్వాత బతుకుజీవుడా అంటూ బయటపడ్డాడు.

 తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హైదరాబాద్ లోని ఓ భవనం లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. సైపాబాద్‌లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చి తిరిగి వెళ్తుండగా లిఫ్ట్‌ మధ్యలోనే ఆగిపోయింది. ఆయనతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు, పలువురు  ఆయనతోపాటు లిప్ట్‌లో ఇరుక్కుపోవడంతో ఆందోళనకర వాతావరణం నెలకొంది.

మంత్రిని లిప్ట్‌ నుంచి బయటకు తీసేందుకు సిబ్బంది నానా కష్టాలు పడ్డారు. అయితే 30 నిమిషాల తరువాత మంత్రి లిఫ్ట్‌ నుంచి బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో లిప్ట్‌ మధ్యలోనే ఆగిపోయిందని సిబ్బంది తెలిపారు.మంత్రి సేఫ్ గా బయటపడడంతో  పెద్ద ప్రమాదం తప్పినట్టైంది.
Tags:    

Similar News