తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొసంగుతుంది. రోజురోజుకి రాష్ట్రంలో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ కరోనా భారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు తెలంగాణ రాజకీయ ప్రముఖులు , ఎమ్మెల్యేలు కరోనా భారిన పడగ ... తాజాగా మరో ఇద్దరు రాజకీయ నేతలు కరోనా బారిన పడ్డారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోమటిరెడ్డి ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ క్రమంలో కరోనా వైరస్ సోకినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని తెలిపారు.
అయితే ప్రస్తుతం తాము ఆరోగ్యంగానే ఉన్నామని ఎంపీలు తెలిపారు. అలాగే ఈ మధ్య కాలంలో తమతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మరోవైపు తెలంగాణలో తాజాగా 1421 కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,001 కి చేరింది. ఇందులో 2,07,326 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 20,377 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో తెలంగాణాలో మొత్తం 6 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 1298కి చేరింది.