మహమ్మారి వైరస్ తెలంగాణలో ప్రమాదకర స్థాయిలో ఉంది. నిత్యం రెండు వేలకు చేరువలో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అలా పెరుగుతూ.. పెరుగుతూ ఇప్పుడు ఏకంగా మొత్తం 25 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇదే ఉధృతి వైరస్ కొనసాగిస్తోంది. తాజాగా సోమవారం 1,831 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 11 మంది వైరస్ తో బాధపడుతూ మృత్యువాత పడ్డారు.
తాజా లెక్కలతో కలిపి మొత్తం కేసులు 25,733కి చేరగా.. మొత్తం మృతులు 306 మంది ఉన్నారు. వైరస్ నుంచి కోలుకుని 2,078 మంది డిశ్చార్జయ్యారు. ఇంతమొత్తంలో డిశ్చార్జ్ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 10,646. అత్యధికంగా కొత్తగా కేసులు యథావిధిగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదయ్యాయి.