ఆత్మహత్యల్లో తెలంగాణ రికార్డ్.. 8 ఏళ్లలో సాధించింది ఇదేనా?

Update: 2022-06-02 10:49 GMT
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్లు అయిన సందర్భంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు, ప్రజలు ఎక్కడికక్కడ జెండాలు ఎగురవేసి సంబురంగా జరుపుకున్నారు.

తెలంగాణ జీడీపీని, సంపదను, ఆర్థిక వృద్ధిని కేసీఆర్ ఎలుగెత్తి చాటాడు.  అయితే ఇది కోణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపులో ఆత్మహత్యలు కూడా పెరిగాయని ఎన్.సీ.ఆర్బీ రిపోర్టులో వెల్లడించింది.

జాతీయ నేరాల నమోదు సంస్థ ఎన్.సీ.ఆర్.బీ  లెక్కల ప్రకారం హత్యలు, గణాంకాలు ఆరాతీస్తే తెలంగాణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కుటుంబ కలహాల కారణంగా అత్యధికంగా తెలంగాణలో 20.6శాతం హత్యలు జరిగాయి.

ఇక ఆ తర్వాత స్థానం వివాహేతర సంబంధాలదే.. ఎఫైర్ల కారణంగా 11.45శాతం హత్యలు చోటుచేసుకున్నాయి. తర్వాత వరకట్నం కారణంగా 5.97శాతం, ఆస్తి వివాదాలతో 11.45శాతం హత్యలు చోటుచేసుకుంటున్నాయి. అంటే బంధాలు, అనుబంధాల కారణంగానే దాదాపు సగం హత్యలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యల శాతం అధికంగా పెరిగిందని ఎన్.సీఆర్బీ రిపోర్టులో వెల్లడైందని సామాజికవేత్త కోట నీలిమ ట్వీట్ చేశారు. దేశ ఆత్మహత్యల రేటుతో పోల్చితే రాష్ట్ర ఆత్మహత్యల రేటు రెండింతలు ఉందని తెలిపారు.

ఆత్మహత్యల రేటు దేశంలో 11.3 శాతం ఉంటే తెలంగాణలో 22.5 శాతం ఉందని ఈ ఏ ళ్లలో సాధించినది ఇదేనా అని ఎన్.సీఆర్బీ నివేదికలో వివరాలతో ట్వీట్ చేశారు.  

ఎన్.సీ.ఆర్బీ గణాంకాల ప్రకారం.. 2020లో రాష్ట్రంలో 1266 మంది మైనర్లు వివిధ నేరాలలో అరెస్ట్ అయ్యారు. అంటే సగటున  రాష్ట్రంలో నెలకు వందమంది మైనర్లు వివిధ నేరాలలో అరెస్ట్ అవుతున్నారని తెలిపారు.
Tags:    

Similar News