తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే మాటలకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో పరిస్థితి పూర్తి అదుపులో ఉందని.. తాను వేసుకున్న అంచనా ప్రకారమైతే.. ఏప్రిల్ 25 నాటికి కొత్త కేసులు వచ్చే అవకాశమే ఉండదన్న మాటను చెప్పారు సీఎం కేసీఆర్. ఆయన నోటి నుంచి ఆ మాటలు వచ్చిన రెండు రోజులకే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక కేసులు నమోదు కావటం ఆశ్చర్యం తో పాటు.. ఆందోళనకు గురి చేస్తోంది. సోమవారం ఒక్క రోజులోనే 61 పాజిటివ్ కేసుల్ని గుర్తించినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం మొదలైన తర్వాత.. ఒకే రోజులో అత్యధికంగా నమోదైన మూడు రోజుల్లో సోమవారం (ఏప్రిల్ 13) నిలిచింది. సోమవారం 61 కేసులు పాజిటివ్ గా తేలితే.. ఇంతకు ముందు ఏప్రిల్ 3న 75 కేసులు పాజిటివ్ గా తేలాయి. ఏప్రిల్ 5న 62 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 592 పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో మూడు రోజుల్లో నమోదైన కేసులే యాభై శాతానికి దగ్గరగా ఉండటం గమనార్హం.
ఇదంతా ఒక ఎత్తు అయితే మొత్తం కేసుల్లో 40 శాతం వరకూ హైదరాబాద్ మహానగరంలోనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజులోనే పాతబస్తీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన పదమూడు మందికి పాజిటివ్ కేసులు నమోదు కావటం తో అధికారులతో పాటు స్థానికులు సైతం ఉలిక్కిపడేలా చేసింది. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. తాజాగా వెలుగు చూసిన పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ నగరానికి చెందిన మూడు ప్రైవేటు ఆసుపత్రి సిబ్బందికి కరోనా సోకటంగా చెప్పాలి.
ఇటీవల కాలంలో తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు కావటంతో రాష్ట్ర ప్రజలంతా ఊపిరిపీల్చుకుంటున్న పరిస్థితి. అందుకు భిన్నంగా సోమవారం 61 కేసులు పాజిటివ్ గా తేలటంతో కరోనా ప్రమాదం ఎంతలా పొంచి ఉందన్న విషయం కళ్లకు కట్టినట్లుగా తేలినట్లైంది. ఎందుకిన్ని కేసులు ఒక్క సారిగా బయటకు వచ్చాయి? తెలంగాణ లో కేసుల నమోదు తగ్గుముఖం పట్టినట్లుగా భావిస్తున్న వేళ.. ఇంత భారీగా కేసులు ఎందుకు నమోదైనట్లు? అన్నది ప్రశ్నగా మారింది.
వేర్వేరు తేదీల్లో చేసిన పరీక్షా ఫలితాలు ఒక్కసారిగా వెలువడటం కూడా కేసుల సంఖ్య పెరిగినట్లుగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. తాజాగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికం ఢిల్లీ సదస్సు తో లింకు ఉన్న వారు.. వారి కారణంగా వ్యాప్తి చెందిన వారే కావటం గమనార్హం. ఇప్పటికైనా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగిన వారు తమకు తాముగా బయటకు వచ్చి.. పరీక్షలు చేయించుకోవటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.