హైకోర్టు స్టే.. సెక్రెటేరియట్ కలిసొచ్చిందిలా!

Update: 2020-03-29 10:24 GMT
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేసినా కలిసొస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఆయన రాష్ట్రంలో ఎదురులేకుండా పోయింది. రాష్ట్రంలో బలంగా ఉండే ప్రతిపక్షాలు కేసీఆర్ వ్యూహానికి కకావికలం అయ్యాయి. రెండోసారి బంపర్ మెజార్టీతో కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. దీంతో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. ఇదిలా ఉండగానే కేసీఆర్ గతంలో తెలంగాణ ప్రభుత్వ పాత సచివాలయ భవనాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని భావించారు. దీంతో ప్రతిపక్షాలన్నీ కోర్టుకు వెళ్లి హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో కోర్టు సచివాలయాన్ని కూల్చకుండా స్టే విధించింది.

కేసీఆర్ కు నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇవ్వడంతో సచివాలయాన్ని అలాగే వదిలేశారు. ఈ నిర్ణయమే ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కు - తెలంగాణ ప్రజలకు నేడు వరంలా మారింది. తెలంగాణలో కరోనా ఎంట్రీతో గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం ఉన్న పాత సెక్రటేరియట్ భవనాన్ని ఐసోలేషన్ కేంద్రాన్ని మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది.

పాత సచివాలయాన్ని పరిశీలిస్తే ఇందులో 10భారీ బ్లాక్‌ లు ఉన్నాయి. వీటిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనకు ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఏపీకి ఐదు బ్లాకులు - తెలంగాణకు నాలుగు బ్లాకులు - మిగిలిన ఒకటి(G Block) ఖాళీగా ఉంచారు. ఎందుకంటే ఇది శిథిలావస్థలో ఉంది. ఆ తర్వాత జగన్ మోరెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ బ్లాకులను కేసీఆర్‌ కు అప్పగించిన సంగతి తెల్సిందే.

హైకోర్టు స్టే ఉత్తర్వుల కోసం కాకపోతే.. కేసీఆర్ సర్కార్ గతేడాదే ఈ భారీ సచివాలయాన్ని కూల్చివేసేది. ప్రస్తుతం హైకోర్టు స్టే ఉత్తర్వులు తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడాయి. తాజాగా కరోనా రోగులకు రాష్ట్రంలో సౌకర్యాలు దొరకడం లేదు. పాత సచివాలయంలోని పది బ్లాకుల్లో వేలాది మంది రోగులను ఉంచే సామర్థ్యం ఉన్న పాత సెక్రటేరియట్‌ ను ఐసోలేషన్ కేంద్రాలుగా ఉపయోగించాలని కెసిఆర్ సర్కారు తాజాగా నిర్ణయించింది. అన్ని బ్లాకులలో లిప్ట్-ఇతర సౌకర్యాలు ఉన్నాయి.

 నాడు సెక్రెటేరియట్స్ కూల్చొద్దని కోర్టు నుంచి ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన నిర్ణయం నేడు అనుకూలంగా మారింది. ఏదిఏమైనా తెలంగాణలో కేసీఆర్ ఏం చేసినా కలిసొస్తుందనడానికి హైకోర్టు స్టే నే నిదర్శంగా నిలుస్తుంది. టైంకి.. కలిసి రావడమంటే ఇదేనేమో మరీ..


Tags:    

Similar News