టీ-టీడీపీలో ఘ‌ర్ వాప‌సీ మంత్రి ప‌నిచేస్తుందా?

Update: 2022-12-24 07:42 GMT
తెలంగాణ టీడీపీని పుంజుకునేలా చేయాల‌ని.. పార్టీని మ‌ళ్లీ గాడిలో పెట్టాల‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల నిర్వ‌హించిన ఖ‌మ్మం స‌భ‌లో నొక్కి వ‌క్కాణించారు. పార్టీ ఇక్క‌డ కొత్త కాద‌న్నారు. అనేక మంది నాయ‌కులు.. గ‌తంలో వీరోచితంగా ప‌నిచేశార‌ని..కొనియాడారు. అయితే.. వివిధ కార‌ణాల‌తో పార్టీ నుంచి వారంతా దూర‌మ‌య్యార‌ని చెప్పారు. అయితే.. ఇప్పుడు మ‌ళ్లీ రావాల‌ని.. ఆయ‌న పిలుపునిచ్చారు.

అయితే.. ఇప్పుడు ఈ ఘ‌ర్ వాప‌సీ మంత్రి ప‌నిచేస్తుందా?  అనేది ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఖ‌మ్మంలోనే కీల‌క నేత‌లు చాలా మంది టీడీపీ నుంచి అధికార బీఆర్ ఎస్‌లోకి గతంలోనే వెళ్లిపోయారు. వీరిలో కొంద‌రికి అప్ప‌ట్లో బాగానే.. ప‌దువులు ద‌క్కాయి. కానీ, త‌ర్వాత‌.. కొత్త‌నీరు రావ‌డంతో వీరంతా ప‌క్క‌కు వెళ్లిపోయారు. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి ఏంటి? అనేది చూడాలి. ఇలాంటివారి వ‌రుస‌లో ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు ఉన్నారు.

ఖమ్మం జిల్లాకే చెందిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నారు. ఆయ‌న‌కు ఇప్పుడు బీఆర్ ఎస్‌లో ఎలాంటి ప్రాధాన్యం లేదు. సీఎం అప్పాయింట్‌మెంటు లేకుండానే వెళ్ల‌క‌ల‌వ‌గ‌లిగిన‌.. తుమ్మ‌ల‌.. ఇప్పుడు మాత్రం.. ఆఛాయ‌ల‌కు కూడా రానివ్వ‌డం లేదు. పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌త్యామ్నాయం కూడా బీఆర్ ఎస్‌కు ఉంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వ‌స్తార‌ని టీడీపీ నేత‌లు అంటున్నాయి.

ఇక, నిజామాబాద్ జిల్లా కు చెందిన కీలక నాయకుడు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. 2014 తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మండవను.. సీఎం కేసీఆర్ స్వయంగా పిలిపించుకుని తమ పార్టీలో చేర్చుకున్నారు. త‌ర్వాత నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ, అంత‌ర్గ‌త స‌ర్వేల‌తో ఇది కూడా సాధ్యం కాలేదు. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. మ‌రి వీరిని టీడీపీ ఏమేర‌కు ప్ర‌భావితం చేస్తుంద‌నేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News