నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)పై వ్యతిరేకంగా తమిళనాట ఉద్యమం తీవ్రమవుతోంది. అయితే మిగతా ప్రాంతాల్లో కంటే తమిళనాడులోనే ఈ సమస్యను ఎక్కువగా తీసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ రాష్ట్రంలో నీట్ విద్యార్థులు ఎక్కువగా ఉండడంతో దీనిపై వ్యతిరేకత ప్రభావం ఎక్కువగా పడుతోంది. రాష్ట్ర విద్యార్థుల నుంచి నిరసన ఎక్కువవుతున్న నేపథ్యంలో సీఎం స్టాలిన్ సైతం నీట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా కోరిటనట్లు సమాచారం. కానీ కేసీఆర్, జగన్ లు మాత్రం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
ఇదిలా ఉండగా ఏపీకి చెందిన ఓ విద్యార్థి నీట్ ను రద్దు చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ను కోరారు. ఏపీకి చెందిన విద్యార్థి తమిళనాడు ముఖ్యమంత్రిని కోరడంపై సర్వత్రా ఆసక్తిగా మారింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు ఎలాగూ పట్టించుకోవడం లేదని, అందుకే స్టాలిన్ ను సంప్రదిస్తున్నారని అంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో కంటే తమిళనాడులోనే నీట్ రాసేవారు ఎక్కువగా ఉన్నందున అక్కడ నీట్ రద్దుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అనుగుణంగా నీట్ రద్దుపై తగిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమైంది.
గతేడాది సెప్టెంబర్లో విద్యార్థులను నీట్ నుంచి మినహాయించాలని అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. అలాగే 12వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెడికల్ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవాలని ప్రతిపాదించారు. అయితే ఈ బిల్లును గవర్నర్ కు పంపగా చాలా కాలం తన దగ్గరే పెట్టుకొని వెనక్కి పంపారు. అయితే మరోసారి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్ణయించాలని అనుకుంటున్నారు. అయితే ఈ బిల్లుపై పోరాడేందుకు మరి కొంత మంది కలిసి రావాలని స్టాలిన్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాల తెలంగాణ, ఏపీ సీఎంల మద్దతు కోరుతున్నారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు.
నీట్ రద్దుపై గతంలోనూ తమిళనాడులో ఆందోళనలు జరిగాయి. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా సినీ ప్రముఖులు సైతం మద్దతు పలికారు. అంతేకాకుండా నీట్ వల్ల చాలా మంది గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని కోర్టులో న్యాయవాదులు వాదించారు. అయితే సుప్రీం కోర్టులో ఓ బాలిక పిటిషన్ వేసినా తిరస్కరణకు గురికావడంతో గతంలో ఆత్మహత్యకు పాల్పడింది. తాజాగా మరోసారి ఈ నిరసన ఉధృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే మిగతా సమస్యలను చక్కబెట్టుకొస్తున్న స్టాలిన్ నీట్ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో చూడాలి.