ప్రస్తుత ప్రపంచం లో ఇంటర్ నెట్ లేకుండా జీవించడం చాలా కష్టం. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్ నెట్ లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. ఇంటర్ నెట్ లేకపోతె ఒకానొక సమయంలో అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. అంతలా ఇంటర్నెట్ మనిషి జీవితంలో భాగమైపోయింది. ఇకపోతే ఇంటర్‌నెట్ వినియోగించే తెలుగువారంతా.. తమకు తెలుగు లోనే సమాచారం కావాలని కోరుకుంటున్నారు. మాతృభాష అయిన తెలుగు లో టైపింగ్ కోసం తెలుగు కీ బోర్డులను వినియోగిస్తున్నారు. గూగుల్ సేవలను అమ్మ భాషలోనే పొందుతున్నారు.
వికీపీడియా సమాచారం మాతృ భాషలోనే చదవడానికి ఎక్కువ గా ఇష్ట పడుతున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఇంటర్‌నెట్ ను వినియోగిస్తున్న తెలుగువారిలో 92 శాతం మంది తెలుగే కావాలి అని కోరుకుంటున్నట్టు గూగుల్ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీంతో ఇంటర్‌నెట్ దిగ్గజ సంస్థలు తెలుగుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ఈ విషయంలో గూగుల్ ఇప్పటికే ముందుండగా.. వికీపీడియా, ఇతర సంస్థలూ ఇదే బాటలో పయనిస్తున్నాయి. తెలుగువారికి దగ్గరవ్వాలంటే తెలుగుకు దగ్గరవ్వాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. ఈ పరిణామాలు ఇంటర్‌నెట్ లో తెలుగుకు మరింత వెలుగులు ఇస్తున్నాయి.
2016 చివరి నాటికి 4 కోట్ల మంది తెలుగువారు ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్టు గూగుల్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. 2019 నాటికి ఈ సంఖ్య 7 కోట్ల కు చేరింది. మాతృభాషల వినియోగంపై తాజాగా గూగుల్ మరో సర్వే చేయగా సగటున ప్రతి 10 మంది భారతీయ వినియోగదారుల్లో 9 మంది గూగుల్‌లో తమ తమ భాషల్లోని సమాచారం కోసమే వెతుకుతున్నారని తెలిపింది. భారతీయ భాషలు వాడేవారిలో 88 శాతం మంది తమ భాషల పట్ల ఆసక్తి చూపిస్తుండగా.. తెలుగులో ఈ సంఖ్య మరింత అధికంగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. ఇతర భాషల్లో ఇది 88శాతం ఉండగా, తెలుగులో 92 శాతం మంది ఉండటం విశేషం.