చైనాలో పుట్టి ప్రపంచానికి విస్తరించిన కరోనా వైరస్ గుప్పిట చిక్కి యూరప్ లోని ఇటలీ దేశం విలవిలలాడుతోంది. ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ తదితర దేశాల్లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. కరోనా భయంతో చాలా దేశాల్లో రవాణ, ప్రజాజీవనం స్తంభించిపోయింది.
చైనాతో తర్వాత అత్కంత ఎక్కువ కరోనా మరణాలు నమోదైన దేశం ఇటలీ. ఇక్కడ ఇప్పటికే 36శాతం మరణాలు కరోనా వల్లే జరిగాయి. 631మంది మరణించారు. చైనా, ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను ప్రభుత్వం ప్రత్యేక విమానాల్లో తీసుకొచ్చింది. అయితే ఇటలీ నుంచి మాత్రం భారతీయులను తరలించలేదు. దీంతో అక్కడ చిక్కుకున్న భారతీయులు, తెలుగు వారు ఇప్పుడు ఆందోళనతో రక్షించండి అంటూ వీడియో సందేశం పంపుతున్నారు.
ఇటలీని వణికిస్తున్న కరోనా వైరస్ ధాటికి తెలుగు విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. భారత్ కు తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నా.. ఇటలీలో అందరినీ గృహనిర్భందంలో ఉండాలని బయట తిరగవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇక విమానాశ్రయంలో ఇరుక్కుపోయిన తెలుగు విద్యార్థులను భారత్ కు తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని వారంతా వీడియోలో ప్రభుత్వాన్ని కోరారు. తామంతా ఇటలీలోని మిలాన్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయినట్లు తెలిపారు. నగరాలన్నీ నిర్మానుష్యంగా మారాయని.. తమను తీసుకెళ్లాలని వారు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అయితే భారత్ కు వచ్చేవారంతా తమకు కరోనా లేదని సర్టిఫికెట్ ఇవ్వాలని కేంద్రం రూల్ పెట్టింది. తమకు కరోనా లేదని చెబుతున్నా ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కనివ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ఎయిర్ ఇండియా టికెట్లు తీసుకున్నా తమను తీసుకుపోవడం లేదని.. డబ్బులు ఇవ్వడం లేదని వారంతా కేంద్రానికి వీడియోలో మొర పెట్టుకున్నారు.