తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ఎత్తుగడలను కొత్తగా అమల్లో పెడుతోంది. సిద్ధాంతపరంగా బద్ధశత్రువు అయిన కాంగ్రెస్‌తో చేరువ అవుతున్న తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని మేనేజ్ చేసుకునేందుకు కారణాలు వెతుక్కుంటోంది. తనదైన శైలిలో మరో కారణంగా ఆ పార్టీకి చేరువ అవుతోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విషయంలో మరోమారు టీడీపీ తన బుద్ధిని నిరూపించుకుంది. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ల దాఖలు సమయం ముగిసిపోయింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ పోటీ పడుతుండగా.. విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీకే హరిప్రసాద్ బరిలో ఉన్నారు. హరివంశ్ - బీకే హరిప్రసాద్ ఇవాళ తమ నామినేషన్లను అధికారులకు సమర్పించారు.
హరివంశ్ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ సహా ఇతర పక్షాలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్రమంత్రి అనంత్ కుమార్ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ తన అభ్యర్థిని రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తక్షణమే స్పందించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇవ్వమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. విపక్షాల అభ్యర్థి బీకే హరిప్రసాద్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చౌదరి తెలిపారు. ఈ మేరకు హరిప్రసాద్ కు మద్దతుగా తమ పార్టీ ఎంపీలు ఓటేస్తారని చెప్పారు. బీకే హరిప్రసాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ఎన్డీఏ అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ పోటీ చేస్తున్నారు.
కాగా, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఎంపీకి మద్దతివ్వడం ఆసక్తికరంగా మారింది. నాలుగేళ్ల పాటు బీజేపీతో దోస్తీ చేసి రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన టీడీపీ దాదాపు గత నాలుగేళ్లుగా ఎన్డీయే వ్యతిరేక జపం చేస్తుండటం, తన సొంత బలం చూపించుకోకుండా...కాంగ్రెస్ తో పొత్తుకు ఆరాటపడుతుండటం చిత్రంగా ఉందంటున్నారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా పడిన ఈ దోస్తీ బంధం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మరింత బలపడుతోందని....రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్-టీడీపీ కలిసి పోటీ చేయడం ఖాయమని చర్చించుకుంటున్నారు. రాష్ర్టాన్ని బజారన పడేశారని...ఇటలీ నాయకురాలి వల్లే తాము రోడ్డున పడ్డామని గగ్గోలు పెట్టిన టీడీపీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో దోస్తీకై ఆరాటపడటం చూస్తుంటే....రంగులు మార్చడంలో టీడీపీకి ఊసరవెళ్లి కూడా సాటిరాదని వ్యాఖ్యానిస్తున్నారు.