ఏపీ నూతన రాజధాని అమరావతిలో పరిస్థితులు చేయిదాటిపోయాయి. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పై సొంత టీడీపీ నేతలే పోరుకు రెడీ అయ్యారు. మంగళవారం ఎమ్మెల్యే అనుకూల - వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కొద్దిరోజులుగా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ను స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా వెంకటపాలెం నుంచి తూళ్లూరు వరకు ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం పాదయాత్ర చేపట్టింది. దీన్ని వెంకటపాలెం వద్ద ఎమ్మెల్యే వర్గం అడ్డుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం.. తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వచ్చి చెదరగొట్టారు.
ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పై అసమ్మతి తగ్గించేందుకు మంత్రులు రంగంలోకి దిగినా ఫలితం లేకుండా పోయింది. రానున్న ఎన్నికల్లో శ్రవణ్ కుమార్ కు టికెట్ ఇస్తే ఓడిస్తామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో వర్గాలను తయారు చేస్తున్న ఎమ్మెల్యే చేతుల్లో టీడీపీని పెట్టడం సరైంది కాదని వారు స్పష్టం చేశారు. టీడీపీ నేతలు నరేంద్రబాబు - సుధాకర్ తదితరుల నివాసాల్లో శనివారం విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. అనంతరం పాదయాత్ర చేపట్టగా గొడవలకు దారితీసింది. ఇలా టీడీపీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత అమరావతిలో ఆందోళనకు కారణమైంది.