ప్రెస్ క్లబ్ వద్ద కత్తిమహేష్...ఫవన్ ఫ్యాన్స్ రచ్చ..పోలీసుల ఎంట్రీ
సినీ విమర్శకుడు కత్తి మహేష్ ప్రెస్ మీట్ పర్వం ఉద్రిక్తంగా మారింది. జనసేన అధినేత - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బహిరంగ చర్చకు సిద్ధమైన మహేష్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ను వేదికగా చేసుకొని అక్కడికి చేరుకోగా...అప్పటికే అక్కడ వేచి ఉన్న పవన్ ఫ్యాన్స్ ఆయన్ను నిలువరించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ తో చర్చించేందుకు ముందు చెప్పినట్టుగానే తాను వచ్చేశానని, ఇప్పుడు చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రెస్ క్లబ్ వద్దకు వచ్చిన కత్తి మహేష్ మీడియాకు తెలిపారు. పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పిస్తున్న కత్తి మహేష్ ను అడ్డుకునేందుకు ఆయన అభిమానులు భారీగా విచ్చేశారు. కొద్దిసేపటి క్రితం సినీ విమర్శకుడు కత్తి మహేష్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వచ్చాడు. ఆయన, తనను చుట్టుముట్టిన మీడియాతో మాట్లాడుతూ - ముందుగా తాను చెప్పినట్టుగానే వచ్చానని - పవన్ కల్యాణ్ - పూనం కౌర్ లేదా వారి తరఫున ఎవరు తనతో చర్చించేందుకు వస్తారో చూస్తున్నానని అన్నాడు. తన సొంత కారును వదిలేసి, ఓలా క్యాబ్ ను బుక్ చేసుకుని ప్రెస్ క్లబ్ కు వచ్చినట్లు వివరించాడు.
కత్తి మహేష్ అటు పవన్ ఫ్యాన్స్ రాకతో ప్రెస్ క్లబ్ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ‘‘నీకు సమాధానం చెప్పేందుకు పవన్ కల్యాణ్ ఎందుకు.. మేము చాలు’’ అంటూ అభిమానులు ప్రెస్ క్లబ్ లోపలికి దూసుకు వస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఫ్యాన్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఫ్యాన్స్ అడ్డుకుంటున్న పర్వంలోనే..పోలీసులతో కలిసి ప్రెస్ క్లబ్ లోపలికి వెళ్లిన కత్తి మహేష్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన చాలెంజ్ ని ఎవరైనా స్వీకరిస్తారేమో వేచి చూస్తానని చెప్పారు. మరో పది నిమిషాలు లేదా పావుగంట పాటు పవన్ తరఫున ఎవరు వస్తారో చూస్తానని - ఎవరూ రాకుంటే - తాను చెప్పదలచుకున్నది చెప్పి వెళ్లిపోతానని అన్నారు. అనంతరం పూనం కౌర్‌కు ఆరు ప్రశ్నలు సంధించారు. పవన్ అభిమానులు సోషల్ మీడియాలో తనపై చేస్తున్న వ్యాఖ్యలను కత్తి మహేష్ ప్రస్తావించారు.
పవన్ ఫ్యాన్స్ తనపై సామాజిక దాడి చేస్తున్నారని, వెబ్ సైట్ లో తనపై, తన కుటుంబంపై తప్పుడు రాతలు రాస్తున్నారని కత్తి మహేష్ ఆరోపించారు. తన కుటుంబ సభ్యుల ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి తనను మానసిక క్షోభకు గురి చేశారని కత్తి అన్నారు. ఈ సమస్యకు పవన్ నుంచి పరిష్కారం వస్తుందనుకున్నానని, కానీ పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని కత్తి వ్యాఖ్యానించారు. తన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకే ప్రెస్ క్లబ్ కు వచ్చానని, తన రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే అని కత్తి మహేష్ చెప్పారు. `తన ఫ్యాన్స్ ను పవన్ కంట్రోల్ లో పెట్టుకోవాలి. గత నాలుగు నెలలుగా జరిగిన పరిణామాలతో నాకు అర్థం అయింది ఏంటంటే...జనవరి ఒకటిన నాకు తెలిసింది ఏమంటే..పవన్ ఫ్యాన్స్‌కు నాకు కాదు.పవన్ కు, నాకు జరుగుతోంది. తన ఫ్యాన్స్ లో ఉన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు. జనాలను వాడుకునే బ్రోకర్. కక్షసాధింపు కోసం పార్టీ పెట్టానని ఆయనే చెప్పాడు. ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు కోసం కాదు పార్టీ పెట్టేంది. ఆయన గురించి ఒక్క మాట మాట్లాడితే ఫ్యాన్స్ విరుచుకుపడతారు. అయినా ఈయన మాట్లాడారు. రాజకీయ ప్రయాణం గురించి పది ప్రశ్నలు వేశాను. ఆయన గురించి సమాధానం చెప్పరు. నా వ్యక్తిత్వం కావాలి. సామాజిక బహిష్కరణ చూసేశాం. సినిమా పరిశ్రమ చేసేసింది. మళ్లీ ఇప్పుడు వీళ్లేంటి చేసేది` అని వ్యాఖ్యానించారు.