అచ్చం తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్లే.. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

Update: 2021-03-03 17:30 GMT
గతానికి మించి ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రోడ్డుప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారుల రక్తదాహానికి పెద్ద ఎత్తున ప్రాణాలు పోతున్నాయి. నిజంగా రహదారులకు రక్తదాహం ఉందా? అన్న ప్రశ్న వేసుకుంటే.. అది నిజం కాదనే చెప్పాలి. రోడ్ల కంటే కూడా వాటి మీద వాహనాలు నడిపే మనుషుల తీరే ప్రమాదాలకు కారణంగా చెప్పాలి.టీం  అతి వేగం.. బండి.. రోడ్డుసామర్థ్యాన్ని పట్టించుకోకుండా డ్రైవ్ చేసే నిర్లక్ష్యం.. తాగి వాహనాల్ని నడపటం లాంటివెన్నో.. ప్రమాదాలకు.. ప్రాణాలు పోవటానికి కారణంగా చెప్పొచ్చు.

తాజాగా అమెరికాలో దారుణ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియాలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 15 మంది మరణించారు. జాతీయ రహదారి గస్తీ అధికారి చెబుతున్న సమాచారం ప్రకారం ఒక ట్రక్కును ఎస్ యూవీ ఢీ కొట్టిన ఘటనలో భారీ ఎత్తున మృతులు ఉన్నారని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన చోటే.. పద్నాలుగు మంది అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించారు.

ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురుపరిస్థితి విషమంగా ఉందంటున్నారు. మరణించిన వారంతా వ్యవసాయ కూలీలు అయి ఉంటారని భావిస్తున్నారు. మృతులలో పదిమంది మెక్సికో పౌరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో వ్యవసాయ కూలీలా? అన్న సందేహం అక్కర్లేదు. మన కలలు కనే అమెరికాలో మురికి వాడలు కూడా భారీగానే ఉంటాయి. కాకుంటే.. మన కళ్లకు ఎప్పుడు రాజసౌథాలు.. తళుకుబెళుకులు మాత్రమే కనిపిస్తాయంతే.
Tags:    

Similar News