ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెచ్చిపోయాడు. సొంత చెన్నై చెపాక్ మైదానంలో స్పిన్ తో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పని పట్టాడు.
ఇంగ్లండ్ తో జరుగుతున్న ఈ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసి అశ్విన్ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. అశ్విన్ తన టెస్ట్ కెరీర్ లో 5 వికెట్లు తీయడం ఇది 29వ సారి కావడం గమనార్హం. స్వదేశంలో 23వ సారి ఈ 5 వికెట్ల ఫీట్ సాధించాడు.
అశ్విన్ స్వదేశంలో 45 టెస్టుల్లో 23 సార్లు 5 వికెట్ల ఫీట్ ను అందుకోగా అతడి కంటే ముందు లంక నుంచి మురళీ ధరన్ 45 సార్లు, హెరాత్ 26 సార్లు, టీమిండియా నుంచి కుంబ్లే 25 సార్లు స్వదేశంలో 5 వికెట్ల ఫీట్ ను అందుకున్నాడు.
ఈ టెస్టులో అశ్విన్ మరో అరుదైన ఫీట్ ను సాధించాడు. టెస్ట్ క్రికెట్ లో 200 మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లను ఔట్ చేసిన తొలి క్రికెటర్ గా అశ్విన్ రికార్డ్ సృష్టించాడు.
ఈరోజు 5 వికెట్లు తీసిన అశ్విన్ టెస్టుల్లో హర్భజన్ ను అధిగమించి స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్ గా రికార్డులకు ఎక్కాడు. ఇప్పటిదాకా అశ్విన్ 45 టెస్టులు ఆడి 268 వికెట్లు తీశాడు. మొత్తంగా 77 టెస్టుల్లో 396 వికెట్లు సాధించాడు. ఇతడి కంటే ముందు కుంబ్లే 62 టెస్టుల్లో 350 వికెట్లు తీశాడు.