దేశంలో ఇప్పటికే చమురు ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం సామాన్యులకు భారంగా మారింది. ఇకపోతే వంట నూనె వంటి నిత్యావసర రేట్లు భగ్గుమంటున్నాయి. అంతే కాకుండా తాజాగా కూరగాయల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి.
మార్కెట్లో టమాటా ధర ఆకాశన్నంటేలా పెరుగుతోంది. ఫలితంగా ఏం కొనే పరిస్థితి లేదు... ఏం తినే పరిస్థి లేదు అన్న చందంగా మారింది. ఇవి చాలవన్నట్లు సామాన్యులకు మరో షాక్ తగలనుంది. త్వరలోనే దుస్తులు మరింత ప్రియం కానున్నాయి. అవేవో ఖరీదైన దుస్తులు అనుకోకండి. ఈ ధరల పెరుగుదల సామాన్యులపైనే ఎక్కువ ప్రభావం చూపడం గమనార్హం.
టెక్స్ టైల్ రంగంలో వచ్చే ఏడాది అనగా 2022 జనవరి నుంచి పెరగనున్నాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ సెప్టెంబర్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. దుస్తులపై సీబీడీటీ వీటి పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలని నిర్ణయించింది.
2022 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఫలితంగా దుస్తుల ధరలు అమాంతం పెరగనున్నాయి. సాధారణంగా టెక్స్ టైల్స్ ఇండస్ట్రీలో రూ.వెయ్యి లోపు విలువ ఉండే వస్తువులే 85 శాతం దాకా ఉంటాయి. అయితే ఈ ప్రభావం ఎక్కువగా సామాన్యుల మీద చూపనుంది.
రూ.వెయ్యి విలువ గల వస్తువల మీద జీఎస్టీ శ్లాబ్ ను 12 శాతానికి పెంచుతూ కేంద్రం ఇటీవలె ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రూ.వెయ్యి లోపు వస్తువుల మీద కూడా జీఎస్టీని ఐదు శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ.. వసూలు చేయనున్నారని టైక్స్ టైల్స్ కమిటీ ఛైర్మన్ సంజయ్ కే జైన్ వెల్లడించారు. అయితే పేదవారు ఎక్కువగా కొనుగోలు చేసే రూ.వెయ్యిలోపు ఉండే వస్తువులపై పడుతుందని... వారు కూడా చెల్లించాల్సిందేనని అన్నారు. అయితే ఇది ద్రవ్యోల్బనానికి దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే వస్త్ర పరిశ్రమ అంతంతమాత్రంగానే ఉంది. కాటన్ ధర 25 శాతం పెరిగింది. ఇతర ముడి సరుకుల ధరలు కూడా పెరిగాయి. ప్యాకింగ్, యార్న్, రవాణా ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. ఇటువంటి సమయంలో మళ్లీ జీఎస్టీ పెంచడ వల్ల ఈ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని క్లాతింగ్ మ్యానుఫాక్చరింగ్ అసోసియేషన్ సభ్యులు అంటున్నారు.
ధరల పెరుగుదల వల్ల తమకు ఎటువంటి లాభం చేకూరదని చెబుతున్నారు. పైపెచ్చు నష్టాలు వచ్చే అవకాశమే ఉందని పేర్కొన్నారు. ఏటా టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ టర్నోవర్ రూ.10 లక్షల కోట్లు కాగా.. రూ.8.5 లక్షల కోట్లపై ఈ ప్రభావం చూపుతుందని అంటున్నారు.