మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. రాజకీయాల్లో మాత్రం శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అన్నదే ఉండరని చెబుతారు. సమకాలీన రాజకీయాల్ని చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంటుంది. బండ బూతులు తిట్టుకున్న నేతలు.. తర్వాతికాలంలో ఒకే పార్టీలో చేరి.. ఓకే పార్టీ కండువా భుజాన వేసుకొని.. భుజం మీద చేతులు వేసుకునే సీన్లు ఇటీవల కాలంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం.
ఇప్పుడు అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. పార్టీ పెట్టిన రోజునే చెల్లెలు కవితకు ఘాటు ప్రశ్నల పంచ్ లు వేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను మర్చిపోలేం. మారిన కాలానికి తగ్గట్లే.. పవన్ కూడా మారినట్లుగా కనిపిస్తోంది. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన పవన్.. తెలంగాణ అధికారపక్షంపై కించిత్ విమర్శలు చేయకపోవటం తెలిసిందే. విమర్శలు తర్వాత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై పొగడ్తలతో ముంచెత్తిన వైనంపై ఆసక్తికరంగా మారింది.
అటు ఆంధ్రప్రదేశ్ లోనూ.. ఇటు తెలంగాణలోనూ అధికారపక్షానికి దగ్గరగా ఉంటూ.. అధికార పక్ష అధినేతల్ని కించిత్ మాటలు అనకుండా ఉంటున్న పవన్ పై ఆయన రాజకీయ ప్రత్యర్తులు ప్యాకేజీల పవన్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా పవన్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాను జనసేన పార్టీ పెట్టిన రోజునే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయటాన్ని మర్చిపోలేం. ఆ తర్వాతి కాలంలోనూ పవన్ తీరుపై కవిత వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ట్విట్టర్ లో కవితను చెల్లెలుగా సంబోధిస్తూ..పవన్ కల్యాణ్ థ్యాంక్స్ చెప్పారు. లోక్ సభలో ఏపీ ప్రజలకు మద్దుతుగా మాట్లాడిన చెల్లెలు కవితగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
ఇటీవల మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏపీకి ఎలాంటి కేటాయింపులు చేయకపోవటంపై ఏపీ ఎంపీలు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తూ.. కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్న వేళ.. ఏపీ ఎంపీలకు మద్దతుగా ఎంపీ కవిత చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని.. చేసిన ప్రమాణాల్ని నిలబెట్టుకోవాలంటూ కవిత పార్లమెంటులో ప్రస్తావించటాన్ని అభినంధించారు పవన్. మొత్తానికి ఏపీకి మేలు చేసేందుకు ఎవరు ముందుకొచ్చినా.. వారిపై గతంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోకుండా కొత్త చుట్టరికాన్ని చుట్టేస్తున్న పవన్ ట్వీట్ కు చెల్లెలు కవిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.