సామాన్యుడు మొదలుకొని సంపన్నుడి వరకు ఇప్పుడు ఆందోళనగా మారిన అంశం ఏమైనా ఉందంటే.. అది పెట్రోల్.. డీజిల్ ధరలే. రోజురోజుకీ పెరుగుతూ.. కళ్లాలు లేని గుర్రాల మాదిరి పరుగులు తీస్తున్న కారణంగా ఇప్పుడు లీటరు పెట్రోల్ రూ.110 అయితే.. మరో ఐదురూపాయిలకు తక్కువగా లీటరు డీజిల్ ధర చేరుకున్న దుస్థితి. ఇప్పుడున్న ఊపు ఇదే రీతిలో సాగితే.. మరికొద్ది నెలల్లోనే లీటరు పెట్రోల్ రూ.150కు చేరుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. పెరిగిన పెట్రోల్.. డీజిల్ ధరలతో అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్న పరిస్థితి. దీంతో..సామాన్యుడి బడ్జెట్ షేక్ అవుతుంటే.. మధ్యతరగతి జీవి బడ్జెట్ లెక్కలతో కిందా మీదా పడిపోతున్నారు.
ఇలాంటివేళ.. ప్రపంచంలో అతి తక్కువ పెట్రోల్ ధర ఉన్న దేశం ఎక్కడ ఉంది? అక్కడ లీటరు పెట్రోల్ ఎంత ఉంటుంది? అన్న విషయాన్ని ఆరా తీస్తే.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి. ఇంత తక్కువ ధరకు పెట్రోల్ దొరుకుతుందా? అన్న ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ప్రపంచంలో అతి తక్కువ ధరకు పెట్రోలో్ లభించే దేశం వెనుజులా. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో విలవిలలాడుతున్న ఆ దేశంలో పెట్రోల్ ధర మాత్రం కారుచౌక కంటే కూడా తక్కువగా ఉంటుంది.
ఆ దేశంలో లీటరు పెట్రోల్ ధర మన రూపాయిల్లో చెప్పాలంటే అక్షరాల రూపాయిన్నర మాత్రమే. అంటే మన దగ్గర చాక్లెట్ కంటే తక్కువ ధర అన్న మాట. ఎందుకిలా అంటే.. ఆ దేశంలో చమురు నిల్వలు భారీగా ఉండటమే. ఈ కారణంతోనే తమ పౌరులకు అక్కడి ప్రభుత్వం అంత తక్కువ ధరకు పెట్రోల్.. డీజిల్ ను అందిస్తోంది. ఆ తర్వాత అతి తక్కువ ధర ఉన్న దేశం ఇరాన్ నిలుస్తుంది. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర మన రూపాయిల్లో రూ.4.51. అంటే మన దగ్గర ఒక టీ కూడా రాని రేటుకు అక్కడ లీటరు పెట్రోల్ వచ్చేస్తోంది.ఇక.. అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతూ.. మనుషుల ప్రాణాలకు ఏ మాత్రం రక్షణ ఉండదని భావించే సిరియాలో లీటరు పెట్రోల్ రూ.17 మాత్రమే కావటం విశేషం. ఇక.. లీటరు పెట్రోల్ రూ.40 కంటే తక్కువగా ఉండే దేశాల్లో అంగోలా.. అల్జేరియా.. కువైట్.. నైజీరియా.. తుర్క్ మెనిస్తాన్.. ఖజకిస్తాన్.. ఇథియోపియా దేశాలు ఉన్నాయి.
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు చివరిగా మరో లెక్కను చెప్పాల్సిందే. అదేమంటే.. 2014లో అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 109 అమెరికన్ డాలర్లుగా ఉన్న వేళలో మన దేశంలో లీటరు పెట్రోల్ ధర రూ.71గా ఉంది. 2021 అక్టోబరులో బ్యారెల్ క్రూడాయిల్ ధర 85 అమెరికా డాలర్లుగా ఉంది. కానీ.. దేశంలో మాత్రం లీటరు పెట్రోల్ ధర రూ.111గా ఉండటం గమనార్హం. ఇప్పుడు లెక్కలు వేసుకొని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇలాంటివేళ.. ప్రపంచంలో అతి తక్కువ పెట్రోల్ ధర ఉన్న దేశం ఎక్కడ ఉంది? అక్కడ లీటరు పెట్రోల్ ఎంత ఉంటుంది? అన్న విషయాన్ని ఆరా తీస్తే.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి. ఇంత తక్కువ ధరకు పెట్రోల్ దొరుకుతుందా? అన్న ఆశ్చర్యానికి గురి కాక తప్పదు. ప్రపంచంలో అతి తక్కువ ధరకు పెట్రోలో్ లభించే దేశం వెనుజులా. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో విలవిలలాడుతున్న ఆ దేశంలో పెట్రోల్ ధర మాత్రం కారుచౌక కంటే కూడా తక్కువగా ఉంటుంది.
ఆ దేశంలో లీటరు పెట్రోల్ ధర మన రూపాయిల్లో చెప్పాలంటే అక్షరాల రూపాయిన్నర మాత్రమే. అంటే మన దగ్గర చాక్లెట్ కంటే తక్కువ ధర అన్న మాట. ఎందుకిలా అంటే.. ఆ దేశంలో చమురు నిల్వలు భారీగా ఉండటమే. ఈ కారణంతోనే తమ పౌరులకు అక్కడి ప్రభుత్వం అంత తక్కువ ధరకు పెట్రోల్.. డీజిల్ ను అందిస్తోంది. ఆ తర్వాత అతి తక్కువ ధర ఉన్న దేశం ఇరాన్ నిలుస్తుంది. ఇక్కడ లీటరు పెట్రోల్ ధర మన రూపాయిల్లో రూ.4.51. అంటే మన దగ్గర ఒక టీ కూడా రాని రేటుకు అక్కడ లీటరు పెట్రోల్ వచ్చేస్తోంది.ఇక.. అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతూ.. మనుషుల ప్రాణాలకు ఏ మాత్రం రక్షణ ఉండదని భావించే సిరియాలో లీటరు పెట్రోల్ రూ.17 మాత్రమే కావటం విశేషం. ఇక.. లీటరు పెట్రోల్ రూ.40 కంటే తక్కువగా ఉండే దేశాల్లో అంగోలా.. అల్జేరియా.. కువైట్.. నైజీరియా.. తుర్క్ మెనిస్తాన్.. ఖజకిస్తాన్.. ఇథియోపియా దేశాలు ఉన్నాయి.
ఇక.. పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉండే దేశాల్లో మొదటి స్థానం హాంకాంగ్ దే. చైనాలో అంతర్భాగం అయినప్పటికీ ఆ దేశంలో పెట్రోల్ ధరలు మోత మోగుతుంటాయి. ఆ దేశంలో లీటరు పెట్రోల్ మన రూపాయిల్లో రూ.192. హాంకాంగ్ తర్వాత అతి ఎక్కువ ధర ఉన్న దేశంగా నెదర్లాండ్స్ నిలుస్తుంది. లీటరు పెట్రోల్ ఇక్కడ రూ.163. నార్వే.. ఇజ్రాయల్.. డెన్మార్క్.. మోనాకో.. గ్రీస్.. ఫిన్ లాండ్.. ఐస్ లాండ్ లో లీటరు పెట్రోల్ కొనాలంటే మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.150కు పైనే ఖర్చు చేయాల్సిందే. ఈ లెక్కన మన దగ్గర లీటరుపెట్రోల్ ధర రూ.110 ఉండటం ఎక్కవంటారా? తక్కువ అంటారా?