కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి చెందిన ట్విటర్ ఖాతాను ఆ సంస్థ బ్లాక్ చేయటంపై అభ్యంతరాలు.. విమర్శలు వ్యక్తం కావటం తెలిసిందే. ఎందుకిలా జరిగింది? తెర వెనుక ఏదైనా జరిగిందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివేళ.. ఢిల్లీ హైకోర్టుకు స్పష్టతను ఇచ్చింది ట్విటర్. తమ ప్రమాణాలకు విరుద్ధంగా వ్యవహరించటంతో ఈ చర్యను చేపట్టినట్లుగా పేర్కొంది. లాక్ చేయటానికి దారి తీసిన పరిస్థితుల్ని వివరించింది. దీంతో.. రాహుల్ ట్విటర్ ఖాతా లాక్ వెనుక అనుమానాస్పద అంశాలు ఏమీ లేవన్న విషయం స్పష్టమైనట్లుగా చెబుతున్నారు.
తాజాగా ఢిల్లీ హైకోర్టులో రాహుల్ గాంధీ ఇటీవల పోస్టు చేసిన ట్వీట్ పై అతడి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలైంది. దీనిపై ట్విటర్ ఢిల్లీ హైకోర్టుకుసమాధానం ఇచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల ఒక దళిత బాలికపై హత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ ఉదంతానికి సంబంధించి.. సదరు దళిత బాలిక కుటుంబ సభ్యుల వివరాలు బయట ప్రపంచానికి తెలిసేలా రాహుల్ ట్వీట్ ఉందని.. ఇది తమ పాలసీకి వ్యతిరేకమని చెప్పిన ట్విటర్ ఇండియా..అందుకే ఆయన ట్విటర్ ఖాతాలోని ఆ పోస్టును తొలగించి.. లాక్ చేసినట్లు వెల్లడించింది.
అత్యాచార కేసుల్లో బాధితుల వివరాలు.. వారి కుటుంబ సభ్యుల గురించి అందరికి తెలిసేలా వివరాల్ని ఎట్టి పరిస్థితుల్లో వెల్లడించకూడదు. అందుకు భిన్నంగా ఢిల్లీ దళిత బాలిక హత్యాచార ఉదంతంలో వారి కుటుంబ సభ్యుల వివరాలు అందరికి తెలిసేలా రాహుల్ తన ట్వీట్ తో తెలియజేసిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులోపిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ తాజాగా జరిగింది.
ఈ అంశంలో తమను అనవసరంగా లాగారని ట్విటర్ అభిప్రాయపడింది. తమ పాత్ర ఏమీ లేకున్నా.. ఇందులోకి లాగారని ట్విటర్ కోర్టుకు తెలిపింది. బాధితురాలి కుటుంబ వివరాల్ని అందరికి తెలిసేలా చేసిన రాహుల్ పై చరర్యలకు జాతీయ చిన్నారుల హక్కుల పరిరక్షణ కమిషన్ ను ఆదేశించాలని.. రాహుల్ పై కేసు నమోదు చేయాలని ఒక సామాజిక కార్యకర్త డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును జస్టిస్ డీఎన్ పటేల్.. జస్టిస్ జ్యోతి సింగ్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ కేసు తదుపరి వి