పార్టీల మారడంలో పండితుడు అయిన ఒక ఉత్తరాంధ్ర మంత్రి అప్పుడే జెండా లాగేస్తున్నారని తెలుస్తోంది. ఇది వరకూ కొత్తగా వచ్చిన పార్టీలన్నింటిలోనూ ఒక చూపు చూసిన ఆ మంత్రి ఎన్నికల ముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతాడనే వార్తలు వచ్చాయి.
తెలుగుదేశం పార్టీని వీడి ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చేరతారని కొన్ని రోజుల పాటు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన జనసేన వైపు చూస్తున్నారనే వార్తలూ వచ్చాయి. అయితే చివరకు ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉండిపోయారు. ఆ పార్టీ తరఫున పోటీ చేశారు.
తన అలవాటు ప్రకారం ఈ సారి మరో నియోజకవర్గానికి మారి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. ఇక అందరిలాగే ఆయనా ఎన్నికల ఫలితాల కోసం వేచి ఉన్నారు.
అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రిగా వ్యవహరించిన ఆయన ఇప్పుడు రూటు మారుస్తున్నారనే మాట వినిపిస్తోంది. ఆయన జగన్ కు టచ్లోకి వెళ్లారని సమాచారం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా ఆయన జగన్ వైపు మళ్లుతున్నారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా గెలిచేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అనే లెక్కతో జగన్ పార్టీలోకి చేరే ప్రయత్నంలోఉన్నారని సమాచారం. ఇప్పటికే సంప్రదింపులు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది.
రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక యువ ఎంపీ అభ్యర్థి, ఇప్పుడు విశాఖ నుంచి పోటీలో ఉన్న ఈ మాజీ మంత్రి.. ఇంకా ఫలితాలు వచ్చే ముందే ఇంకా ఎవరెవరు జగన్ ఇంటి తలుపు తడతారో చూడాలి అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు!