ఆ వీడియో చూపించి రూ.5 లక్షలు బ్లాక్ మెయిల్ చేసిన నటి

Update: 2022-07-15 01:30 GMT
సినీ ఇండస్ట్రీ అంటే ఈ ఎఫైర్లు, బంధాలు, అనుబంధాలు ఎక్కువగా ఉంటాయని టాక్. అక్కడ ఎంత త్వరగా కలిసిపోతారో.. అంతే త్వరగా విడిపోతారని ప్రచారం ఉంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఈ తంతు జరుగుతూనే ఉంది.

అయితే ఎక్కువగా సినీ నటులు లోబరుచుకొని బెదిరిస్తూ తమ కోరికలను నటీమణులతో తీర్చుకుంటారు. కానీ ఇక్కడ ఒక నటి ఆ పనిచేసింది. ఓ వ్యక్తి యువతితో సన్నిహితంగా ఉన్న వీడియోలను చూపించి బెదిరింపులకు పాల్పడిన సినీ నటిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సినీ పరిశ్రమలో పనిచేసే 28 ఏళ్ల యువరాజ్ కుమార్ కు అదే పరిశ్రమకు చెందిన 25 ఏళ్ల నటి  ఓ వీడియో పంపింది.అందులో యువరాజ్ ఒక యువతితో శృంగారం చేస్తున్నట్టుగా ఉంది.

ఈ వీడియో బయట పడకుండా ఉండాలనే తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని.. లేని పక్షంలో సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేస్తానని నటి లక్ష్మీ బెదిరింపులకు దిగింది.  ఒక మహిళ అయ్యిండి తనను బెదిరిస్తున్న నటి లక్ష్మీపై యువరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కేసు నమోదు చేసి ఆ నటిని అదుపులోకి తీసుకొని విచారించేందుకు సిద్ధమయ్యారు. సాధారణంగా అమ్మాయిలు ఇలాంటి కేసుల్లో బుక్కైతే అబ్బాయిలు బ్లాక్ మెయిల్ చేస్తుంటారు.కానీ ఈ వర్ధమాన నటి ఏకంగా ఒక వ్యక్తిని బెదిరింపులకు పాల్పడడం చర్చనీయాంశమైంది.

ఇదివరకూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. టాలీవుడ్ కు చెందిన ఓ సినీ రచయితపై పోలీసులు ఇలాంటి కేసులు పెట్టారు.. సదరు రచయిత కూడా ఓ యువతిని బ్లాక్ మెయిల్ చేసి వీడియోలు లీక్ చేస్తానని బెదిరించాడు.   ఆమె ఫిర్యాదు మేరకు బంజారు హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఒక నటి ఇలాంటి కేసులో ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనమైంది.
Tags:    

Similar News