'దిశా' చట్టం.. హైదరాబాద్ లో ఓ ఫార్మసీ విద్యార్థినిని నలుగురు లారీ డ్రైవర్లు, క్లీనర్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన దారుణం నుంచే ఈ చట్టం పుట్టింది. ఈ ఘటన యావత్ తెలుగు రాష్ట్రాలను కదిలించింది. జాతీయ స్థాయిలో దీనిపై దుమారం రేపింది. అయితే ఆ నలుగురు కామాంధులను పోలీసులు ఎన్ కౌంటర్ లో లేపేయడంతో రాళ్లేసిన వారే తెలంగాణ పోలీసులపై పూలు చల్లారు.
దేశాన్ని కదిలించిన ఈ దిశ ఆకృత్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని సీఎం జగన్ ఏపీలో 'దిశా' చట్టాన్ని చేశారు. ఏపీలోని మహిళలకు భద్రత కల్పించేందుకు పలు కీలక సవరణలు చేశారు. ఈ చట్టం ఆమోదం కోసం కేంద్రప్రభుత్వానికి పంపారు. కేంద్రం ఆమోదించిన 'నిర్భయ' చట్టం కంటే కూడా ఈ చట్టం చాలా పవర్ ఫుల్ అని జగన్ చెప్పుకొచ్చారు. దిశ చట్టంతో ఆడపిల్ల మీద చేయివేయాలంటే భయపడేలా చట్టం రూపొందించామన్నారు.
అయితే జగన్ ప్రతిపాదించిన ఈ కలల చట్టాన్ని కేంద్రం ఇప్పటికీ ఆమోదించలేదు. ఏపీ ప్రభుత్వం ఆమోదించి సంవత్సరంపైగా గడిచినా దిశా చట్టానికి మోక్షం కలగడంలేదు. అసలు కేంద్రప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడంలేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికీ సీఎంజగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలిసి మొర పెట్టుకుంటున్నా కేంద్రం ఆమోదించడం లేదు.
ఈ క్రమంలోనే సీఎం జగన్ శుక్రవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. 'దిశ' చట్టం ఆమోదించాలంటూ లేఖలో కోరారు. దిశ బిల్లు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ సమీక్ష నిర్వహించారు. దిశ చట్టం ఆమోదించాలంటే కేంద్రానికి లేఖ రాయాలని డిసైడ్ అయ్యారు.
కేంద్రంతో సీఎం జగన్ ఎంత స్నేహంగా ఉన్నా కూడా ఏపీ ప్రతిపాదనలను కేంద్రం బుట్టదాఖలు చేస్తోందన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు దోస్తానా అంటూనే ఏపీ బిల్లులలో అంతులేని జాప్యంచేస్తోందంటున్నారు. జగన్ సర్కార్ తెచ్చిన బిల్లులను నిర్దాక్షిణ్యంగా పక్కనపెడుతున్న వైనం చర్చనీయాంశమవుతోంది. ప్రతిష్టాత్మకంగా ఏపీప్రభుత్వం చేసిన 'దిశ' బిల్లును సైతం కేంద్రం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తు్నాయి.
ఏపీ ప్రభుత్వం పాస్ చేస్తున్న బిల్లులు కోర్టుల్లోనే కాదు.. కేంద్రం వద్ద కూడా ఆగిపోతున్న తీరుతో జగన్ ఇరుకునపడుతున్నారన్న చర్చ అమరావతి వర్గాల్లో సాగుతోంది. కొన్ని అంశాలపై రాజకీయ పార్టీలు, వాటితో ప్రభావితమయ్యే వారు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. మిగతావి కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు వెళ్తున్నాయి. కేంద్రంతో సంబంధం ఉన్నవే అక్కడకు వెళ్తుంటాయి. కానీ.. వాటికి అక్కడ బ్రేక్ పడుతోంది. దానికి కారణం నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటం.. కేంద్ర చట్టాలకు భిన్నంగా ఉండటమేనన్న ప్రచారం సాగుతోంది.. దిశ బిల్లును రెండు, మూడు సార్లు వెనక్కి పంపిస్తే సవరణలు చేసి ఏపీప్రభుత్వం పంపింది. అయినా ఆమోదించలేదు..కొన్ని అంశాలు, క్లాజులు కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఉండడమే ఏపీ బిల్లులు ఆమోదం పొందకపోవడానికి కారణమన్న ప్రచారం సాగుతోంది. రాష్ట్రం ఇచ్చిన వివరణలు సరిగా లేవంటూ కేంద్రం తోసిపుచ్చుతున్నట్టు తెలుస్తోంది.