చైనాలోని వ్యూహన్ లో మూడేళ్ల క్రితం కరోనా మహమ్మారి తొలిసారి వెలుగు చూసింది. కరోనా ధాటికి యావత్ ప్రపంచం అతలాకుతలమైంది. అగ్రరాజ్యాలు సైతం కరోనాను తట్టుకోలేక విలవిలలాడి పోయాయి. ఇటీవలే కరోనా తొలి కేసు వెలుగు చూసి నాలుగేళ్లు గడిచింది. కాగా గత రెండేళ్లలో యావత్ ప్రపంచం కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే.
కరోనా కాలంలో మాస్కులు ధరించడం.. శానిటైజర్లు వాడటం.. భౌతిక దూరం పాటించడానికి ప్రజలంతా అలవాటు పడ్డారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రజలంతా టీకాలు తీసుకొని కరోనా పోరులో తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. దీనికితోడు కరోనా క్రమంగా తన ప్రభావం కోల్పోవడంతో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది.
ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులన్నీ మళ్లీ మునుపటి పరిస్థితులు వచ్చాయి. మాస్కులు ధరించకుండా బయట తిరిగే రోజులు రావడంతో ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో బిజీగా మారిపోయాయి. అయితే ఇటీవలి కాలంలో చైనాలో వెలుగు చూస్తున్న కరోనా కేసులు ప్రపంచాన్ని మరోసారి భయపెడుతున్నాయి.
అయితే చైనాతో పాటు బ్రెజిల్.. అమెరికా.. కొరియా.. జపాన్ దేశాల్లోనూ తాజాగా కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. వారానికి ఏకంగా 35 లక్షల కొత్త కేసులు నమోదు అవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అన్ని దేశాలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త వేరియంట్లపై జాగ్రత్తగా ఉండాలంటూ తాజాగా అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దేశంలో కొత్తగా నమోదు అవుతున్న కేసులను జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ తో కొత్త వేరియంట్లను సులభంగా గుర్తించవచ్చని కేంద్రం పేర్కొంది.
అలాగే ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని.. స్వీయ నిబంధనలు పాటించాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తుంటే రెండేళ్ల క్రితం నాటి సంఘటనలు భారత్ లో మళ్లీ పునరావృతం కాబోతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దీంతో ప్రజలు కరోనా ముందస్తుగానే కరోనా నిబంధనలు పాటిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.