దుర్గగుడి రథం 3 సింహాల మాయంలో ట్విస్ట్

Update: 2020-09-17 13:00 GMT
ఏపీలోని విజయవాడ దుర్గగుడిలో వెండి రథం సింహపు ప్రతిమల మాయం ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ సింహపు ప్రతిమల మాయం కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. ఈ ప్రతిమలు చోరీ జరిగినట్లు నిర్ధారణ అయ్యింది.

నాలుగు వెండి సింహపు ప్రతిమల్లో మూడు చోరీ అయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. విజయవాడ వన్ టౌన్ పోలీసులకు దుర్గమ్మ ఆలయ చైర్మన్ ఈ మేరకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది కాలంగా రథం తీయలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వెండి రథాన్ని 2002లో తయారు చేయించారు. కనిపించకుండా పోయిన సింహపు ప్రతిమ 3.365 కిలోల వెండితో చేశారు. 2019 ఏప్రిల్ నుంచి ఈనెల 15లోపు చోరీ జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

చోరీకి గురైన మూడు ప్రతిమల విలువ రూ.20 లక్షలు ఉంటాయని అధికారులు అంటున్నారు. రెండో రోజు కూడా విచారణలో సింహం ప్రతిమల ఆచూకీ తెలియలేదు.

ఇక వెండి సింహాల మాయంపై ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకొని విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై వెంటనే దర్యాప్తు ప్రారంభం కానుంది. ఎంతో భద్రత ఉండే దుర్గగుడిలో ప్రతిమల మాయం కలకలం రేపుతోంది.
Tags:    

Similar News