అవును.. రూల్ ప్రకారం అంతా నడుచుకుంటున్నట్లు చెప్పే వ్యవస్థలు.. తమకు తోచినట్లుగా వ్యవహరించటానికి అలవాటు పడి చాలా కాలమే అయ్యింది. ఆదేశాలు ఇవ్వాల్సిన వారు ఇచ్చేసినా.. వాటిని అమలు చేయాల్సిన వారు మాత్రం తమకు తగ్గట్లుగా నిర్ణయాలు తీసుకోవటం.. వాటిని ప్రశ్నించేవారు.. క్రాస్ చెక్ చేసే వారు పెద్దగా కనిపించని పరిస్థితి.
ఈ కారణంతోనే.. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు ఇచ్చిన ఆదేశాలు సైతం అమలు కాని దుస్థితి దేశంలో ఉంది. ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ.. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఒక కేసులో నిందితులకు బెయిల్ ను మంజూరు చేసింది సుప్రీంకోర్టు. కానీ.. అది అమలు కాలేదు. అది కూడా వారం రోజులకు కూడా. దీంతో.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. బెయిల్ మంజూరు అయినప్పటికి సదరు ఆదేశాలు అమలు కాకపోవటంపై సుప్రీంకోర్టు స్వయంగా కేసు నమోదు చేసిన వైనం తాజాగా చోటు చేసుకుంది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని అగ్రా సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు పదమూడు మంది ముద్దాయిలు. ఈ నెల ఎనిమిదిన వారందరికి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాల్ని జారీ చేసింది. అయితే.. ఆదేశాలు జారీ చేసి వారం గడిచినా.. అమలు కాకపోవటంతో సుప్రీంకోర్టు తనకు తానుగా కేసు నమోదు చేసింది. అయితే.. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా.. జైలు అధికారులు ముద్దాయిల్ని ఎందుకు విడుదల చేయలేదంటే.. వారిచ్చిన సమాధానం షాకింగ్ గా మారింది. కొందరు నిందితులు తప్పుడు పత్రాల్ని క్రియేట్ చేసి జైలు అధికారులకు సమర్పిస్తున్నారని.. అందుకే అధికారిక వెబ్ సైట్ లో బెయిల్ వివరాలు పెట్టే వరకు చర్యలు తీసుకోవటం లేదని బదులిచ్చారు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.
దీంతో స్పందించిన చీఫ్ జస్టిస్ రమణ.. మనం ఇప్పుడు సమాచార సాంకేతిక యుగంలో ఉన్నామని.. అయినా సందేశాలు పంపే పావురాల కోసం ఆకాశం వైపు చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇప్పుడున్న విధానాల్ని ప్రక్షాళన చేసేందుకు వీలుగా చీఫ్ జస్టిస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరగా.. సేఫ్ గా కోర్టు ఉత్తర్వుల్ని పంపేందుకు వీలైన మార్గాలకు సంబంధించి రెండు వారాల్లో ప్రతిపాదనలు పంపాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కు సూచన చేశారు.
అంతేకాదు.. దీన్ని నెల రోజుల్లో ఆచరణలోకి పెట్టాల్సి ఉందని తేల్చేశారు. ఉత్తర్వుల్ని పంపేందుకు వీలుగా జైళ్లలో ఉన్న ఇంటర్నెట్ సదుపాయాలపైనా సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాల్ని జారీ చేశారు. మొత్తానికి వ్యవస్థలోని లోపాల్ని సరిదిద్దేందుకు.. న్యాయం సత్వరం అందేందుకు వీలుగా చీఫ్ జస్టిస్ చేస్తున్న ప్రయత్నాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పక తప్పదు.