హైదరాబాద్​ నిండా శంకర్​ దాదా ఎంబీబీఎస్ ​లే..జర భద్రం..!

Update: 2020-12-29 10:30 GMT
అత్యాధునిక వైద్యానికి హైదరాబాద్​ కేంద్రంగా ఉంది. అన్ని రకాల రోగాలకు ఇక్కడ మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. ప్రపంచస్థాయి ఆస్పత్రులు, వైద్యులు హైదరాబాద్​లో ఉన్నారు. అయితే ఇప్పుడు హైదరాబాద్​ నగరం నకిలీ డాక్టర్లకు అడ్డాగా మారింది.
పోలీసులు ఇటీవల దాదాపు 100 మంది నకీలీ డాక్టర్లను గుర్తించారు. హైదరాబాద్ లో ఉండే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు కార్పొరేట్​ ఆస్పత్రులకు వెళ్లేందుకు భయపడుతుంటారు. ఎందుకంటే చిన్నపాటి జ్వరం వచ్చి కార్పొరేట్​ ఆస్పత్రికి వెళ్తే రకరకాల పరీక్షలు చేసి ఫీజులు గుంజుతారు.

దీంతో మిడిల్​క్లాస్​ ప్రజలు చిన్న చిన్న క్లినిక్​లను ఆశ్రయిస్తుంటారు. దీన్ని ఆసరాగా చేసుకొని నకిలీ డాక్టర్లు రెచ్చిపోతున్నారు. వేరే రాష్ట్రాల నుంచి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని క్లినిక్​లు తెరిచి పేద ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటీవల ఇటువంటి డాక్టర్లపై పోలీసులు దృష్టిపెట్టారు. దాదాపు 100 మంది నకిలీ డాక్టర్​లు హైదరాబాద్​లో ఉన్నట్టు గుర్తించారు. ఓ నకిలీ డాక్టర్​ ఏకంగా పోలీసులనే బురిడీ కొట్టించాడు. తేజ అనే నకిలీ డాక్టర్​ గత కరోనా టైంలో పోలీస్​శాఖకు సలహాదారుడిగా కూడా పనిచేశాడట. దీంతో పోలీసులే ఆశ్చర్యపోయారు.

ఢిల్లీకి చెందిన సునీల్ అనే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ద్వారా తేజ, షాబాద్ కు చెందిన రాంరెడ్డి అనే వ్యక్తి నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పొందారని పోలీసులు తెలిపారు.
వీరికి చత్తీస్ గఢ్ యూనివర్సిటీ తరఫున ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు కొన్నట్లుగా తెలిపారు. ఢిల్లీకి చెందిన సునీల్​ అనే వ్యక్తి ఈ నకిలీ సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతడు హైదరాబాద్​కు చెందిన చాలా మందికి రూ. 40 వేలు, 50 వేలు తీసుకొని లంచాలు ఇస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. గతంలో కంపౌడర్లుగా పనిచేసిన వాళ్లు, డాక్టర్ల వద్ద సిబ్బందిగా పనిచేసిన వాళ్లు ఇటువంటి దందా చేస్తున్నట్టు సమాచారం.




Tags:    

Similar News