ఏపీ శాసనమండలి తీరుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పడకేస్తోంది. కనీసం జూలై 1న ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా శాసనమండలి మోకాలడ్డడం పై విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రభుత్వం నిధులను ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్న కేటాయింపు బిల్లును రాష్ట్ర శాసనమండలి ఆమోదించకుండా పక్కనపెట్టడం దుమారం రేపింది.
నిధుల కేటాయింపు బిల్లును బుధవారం శాసనసభ ఆమోదించినప్పటికీ మండలిలో మాత్రం తెలుగుదేశం పార్టీ ఆమోదించకుండా పక్కనపెట్టింది. మండలిలో వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలతో కౌన్సిల్ దాదాని ఆమోదించలేకపోయింది.
ఈ మండలి సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు , ఎపిసిఆర్‌డిఎ రద్దు బిల్లును మొదటగా ఆమోదించుకోవాలని.. చివరిలో నిధుల కేటాయింపు బిల్లును ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుబట్టగా, టిడిపి సభ్యులు నిధుల కేటాయింపు బిల్లును మొదట చర్చకు తీసుకోవాలని వాదించారు.మొదట కేటాయింపు బిల్లు ఆమోదించినట్లయితే, సభను వాయిదా వేస్తారని.. తద్వారా మూడు రాజధానుల బిల్లు మళ్లీ పెండింగ్‌లో ఉంటుందని వైయస్ఆర్సి సభ్యులు భయపడ్డారు.
మొదట మూడు రాజధానుల బిల్లులను ఆమోదించడం తర్వాత కేటాయింపు బిల్లును చేపట్టాలని అధికార వైయస్ఆర్సి మండలిలో గట్టిగా పట్టుబట్టింది. ఇది కౌన్సిల్‌లో గందరగోళానికి దారితీసింది. చివరికి, శాసనమండలి చైర్మన్ అకస్మాత్తుగా సభను వాయిదా వేశారు. దీంతో నిధుల కేటాయింపు బిల్లుతో సహా ఏ బిల్లును ఆమోదించకుండా మండలి వైసీపీ ప్రభుత్వాన్ని దిగ్భ్రాంతి కి గురిచేసింది.
నిధులను ఖర్చు పెట్టడానికి వీలులేకుండా శాసనసభ ఆమోదించిన బిల్లును మండలి వాయిదావేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు జీతాలు, వ్యయాలు సహా ఎలా ఖర్చు చేస్తుందో చూడాలి. బహుషా ఆర్డినెన్స్ తీసుకొస్తుందా? లేదా మరో చట్టపరమైన అభిప్రాయాన్ని తీసుకుంటుందా అనేది వేచిచూడాలి.