ముఖ్యమంత్రి జగన్ యూరప్ ట్రిప్ కు రైట్ రైట్

Update: 2023-04-20 18:17 GMT
విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. సీబీఐ కోర్టు నుంచి అనుమతి వచ్చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో నిందితుడి ఉన్న ఆయన కొంతకాలం జైల్లో ఉండటం.. బెయిల్ మీద రావటం తెలిసిందే. దేశాన్ని విడిచి పెట్టి విదేశాలకు వెళ్లే సమయంలో.. ఆయన తప్పనిసరిగా కోర్టు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. ఇందుకు తగ్గట్లే ఆయన తన యూరప్ పర్యటన కోసం కోర్టును అనుమతిని కోరుతూ ఏప్రిల్ 10న కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పిటిషన్ విచారణను చేపట్టిన సీబీఐ కోర్టు.. తాజాగా సీఎం జగన్ విదేశీ పర్యటనకు ఓకే చెప్పేస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది. కోర్టు తనకు ఇచ్చిన బెయిల్ షరతులకు తగ్గట్లుగా.. కోర్టు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేయటం.. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు ఆదేశాలకు తగ్గట్లే.. తాజాగా కౌంటర్ వేశారు.

దీనిపై వాదనలు ముగిశాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏప్రిల్ 21 నుంచి 29 వరకు యూరప్ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తన విదేశీ పర్యటనకు ముందు మొబైల్ ఫోన్ నెంబరు.. ఈ మొయిల్ ఐడీతో పాటు పర్యటన వివరాల్ని సీబీఐకి ఇవ్వాలంటూ సీఎం జగన్ కు ఆదేశాలు ఇచ్చింది. అయితే.. మాజీ మంత్రి వివేకా హత్య కేసు విచారణకు సంబంధించి ఎంపీ అవినాశ్ ఇష్యూ నేపథ్యంలో యూరప్ ట్రిప్ కు వెళతారా? చివరి నిమిషంలో మనసు మార్చుకునే వీలుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.


Similar News