పిల్లల బాధ్యత విషయంలో తండ్రి ఎంత కీలకమన్న విషయాన్ని తాజాగా ఢిల్లీ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. కొడుకు మేజర్ అయినంత మాత్రాన అతడి చదువు చెప్పించే బాధ్యత నుంచి తప్పించుకోలేరని తండ్రికి స్పష్టం చేసింది. పిల్లలకు చదువు చెప్పించాల్సిన బాధ్యత ఎప్పటికైనా తండ్రిదేనని.. ఆ ఆర్థిక భారాన్ని తల్లి మీద వేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఢిల్లీకి చెందిన ఒక జంట విడాకులు తీసుకున్న తర్వాత కొడుకు చదువుల కోసం ప్రతి నెలా తండ్రి రూ.15వేలు చెల్లించాలని ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తండ్రి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ కీలక వ్యాఖ్య చేసింది. తాజాగా దాఖలు చేసిన పిటిషన్ లో తన కొడుక్కి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు కానీ డిగ్రీ పూర్తి చేసే వరకు కానీ తాను చదువుల కోసం డబ్బులు ఇస్తానని. ఆ తర్వాత ఇవ్వలేనని పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడే వరకు సమాజంలో ఒక గుర్తింపు వచ్చే వరకు.. వారు ఎదిగే వరకు వారి బాధ్యతను తండ్రులు స్వీకరించాలని స్పష్టంచేసింది. కొడుక్కి 18 ఏళ్లు నిండాయని తల్లి మీద బాధ్యతలు వేయకూడదని పేర్కొన్నారు.
కొడుకు మేజర్ అయినంత మాత్రాన అతను ఆర్థికంగా స్వతంత్రుడు కావాలన్న రూల్ లేదని.. కొడుకు ఆర్థికంగా తల్లికి అంది వచ్చే వరకూ అతని బాధ్యత తల్లిదేనని స్పష్టం చేశారు.తాజా కేసు విషయానికి వస్తే ఢిల్లీకి చెందిన ఒక జంటకు 1997లో పెళ్లి కాగా.. 2011లో వారు విడాకులు తీసుకున్నారు. వారికి ఒక కొడుకు.. కుమార్తె. కొడుక్కి 18 ఏళ్లు వచ్చే వరకు.. కుమార్తెకు ఉద్యోగం లేదంటే పెళ్లి అయ్యే వరకు వారి బాధ్యతను తండ్రికి అప్పగిస్తూ తీర్పును ఇచ్చారు. కొడుకు చదువుకు తాను ఖర్చు పెట్టలేనని తండ్రి పెట్టుకున్న పిటిషన్ ను కొట్టేసి.. తాజాగా తీర్పును ఇచ్చింది. ఈ ఉదంతంలో తల్లి ఉద్యోగస్తురాలే అయినప్పటికీ.. చిరు ఉద్యోగం కావటంతో.. తండ్రిని బాధ్యత తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.