చనిపోయినా.. పిల్లలను పుట్టించవచ్చు

Update: 2020-02-03 23:30 GMT
తాజా పరిశోధన ఒక కొత్త విషయాన్ని తెలిపింది. చనిపోయిన వ్యక్తి నుంచి కూడా వీర్యాన్ని సేకరించి పిల్లలను పుట్టించవచ్చని పరిశోధకులు కొత్త విషయాన్ని కనుగొన్నారు.

మనిషి చనిపోయిన 48 గంటల వరకూ అతడి శుక్రకణాలను (స్పెర్మ్)ను గర్భధారణ కోసం ఉపయోగించవచ్చని.. ఆ వీర్యంతో ఆరోగ్యంగా ఉన్న పిల్లలను పుట్టించ్చవచ్చని శాస్త్రవేత్తల బృందం కనిపెట్టింది.

ఈ మేరకు ‘జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్’లో ప్రచురించారు. మనిషి చనిపోయాక అతడి వీర్యాన్ని తీసి స్పెర్మ్ బ్యాంక్ లో నిల్వ చేయవచ్చని కూడా అందులో చెప్పారు. స్పెర్మ్ బ్యాంకులో నిల్వ చేసే శుక్రకణాల సంఖ్యను పెంచవచ్చని కూడా పరిశోధకులు తెలిపారు.

తమకు ఇష్టమైన వారు పిల్లలు కనకుండా చనిపోతే వారి జ్ఞాపకార్థం వారసులను తెచ్చుకోవాలనే వారికి ఈ పరిశోధన ఎంతో ఉపయోగం కానుంది. చనిపోయిన 48 గంటల్లోపు రెండు పద్ధతుల్లో శవం నుంచి వీర్యాన్ని తీసి ప్రొస్టేట్ గ్రంథి ఎలక్ట్రిక్ సిమ్యులేషన్ ద్వారా సర్జరీ చేసి వీర్యాన్ని  తీసి నిల్వ చేసి ఫలదీకరణం చెందించి బిడ్డను కనేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.


Tags:    

Similar News