తొలి డోసు ఫైజర్.. రెండో డోసు కొవిషీల్డ్ వేస్తే ఫలితం అదరహోనట

Update: 2021-07-01 07:30 GMT
రెండు వేర్వేరు టీకాలు రెండు డోసులుగా వేసుకుంటే ఏం జరుగుతుంది? మిశ్రమ డోసులతో లాభమా? నష్టమా? అలా వేసి చూసిన వారిలో రిజల్ట్ ఎలా ఉంది? లాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం ఒక అధ్యయనాన్ని చేపట్టారు. దీని ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న టీకాల్లో మంచి ఫలితాల్ని ఇస్తున్నట్లు చెబుతున్న ఫైజర్ టాకాకు.. సీరం వారి కోవీషీల్డ్ డోసు వేయటం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయన్న దానిపై పరిశోధనలు జరిపారు.

తాజాగా.. దీనికి సంబందించిన వివరాల్ని వెల్లడించారు. మొత్తం830 మందిపై ఈ మిశ్రమ టీకాల్ని వేశారు. వారందరి సగటు వయసు 57.8 సంవత్సరాలుగా తేల్చారు. కొవిషీల్ద్ టీకా రెండు డోసుల్ని వేయించుకున్న వారిని.. కొవిషీల్డ్.. ఫైజర్ టీకాల్నికలిపి వేయించుకున్న వారిలో చోటు చేసుకున్న ఫలితాల్ని పరిశీలించినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఒక డోసుగా కొవిషీల్డ్.. మరో డోసుగా ఫైజర్ ను వేసుకున్న వారిలో స్పైక్ ప్రోీన్ కు వ్యతిరేకంగా ఎక్కువ యాంటీబాడీలు విడుదల అవుతున్నట్లుగా గుర్తించారు.

అయితే.. ఈ రెండు వ్యాక్సిన్లలో దేన్ని ముందు వేసుకోవాలి? అన్న ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. తొలుత ఫైజర్ వ్యాక్సిన్ వేసుకునే వారితో పోలిస్తే.. కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను మొదటి డోసుగా వేసుకొని.. రెండో డోసుగా ఫైజర్ టీకా వేసుకున్న వారిలో యాంటీబాడీలు.. టీ సెల్ స్పందనలు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు. అయితే.. మన దేశంలో ఫైజర్ వ్యాక్సిన్ కు ఇంకా అనుమతులు లభించలేదు.
Tags:    

Similar News